బటర్ మిల్క్ వర్సెస్ లస్సీ : బరువు తగ్గడానికి ఏది మంచిది?

First Published | Sep 16, 2021, 10:39 AM IST

బటర్ మిల్క్ లేదా లస్సీ  ఈ రెండూ ఒకటేనా..? తేడా ఏంటీ..? రెండింట్లో ఏది మంచిది? బరువు తగ్గే ప్రక్రియలో ఏది ఎక్కువ ఉపయోగకరం? అనే విషయంలో గందరగోళం మామూలుగానే ఉంటుంది. అయితే ముందుగా ఈ రెండింటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. 

బిజీగా ఉన్న రోజు, పనితో సతమతమవుతున్న టైంలో ఓ గ్లాసుడు బటర్ మిల్క్ లేదా లస్సీ కంటే రిఫ్రెషింగ్ ఎక్కువ లేదు. ఈ రెండు మంచి పోషకాలతో పానీయాలే. అందరూ వీటిని ఇష్టంగా తాగుతారు. ఈ రెండింటిలోనూ ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. బటర్ మిల్క్, లస్సీ రెండూ గట్ ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మంచిది. 

అయితే, బటర్ మిల్క్ లేదా లస్సీ  ఈ రెండూ ఒకటేనా..? తేడా ఏంటీ..? రెండింట్లో ఏది మంచిది? బరువు తగ్గే ప్రక్రియలో ఏది ఎక్కువ ఉపయోగకరం? అనే విషయంలో గందరగోళం మామూలుగానే ఉంటుంది. అయితే ముందుగా ఈ రెండింటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. 


మజ్జిగ లేదా బటర్ మిల్క్ తేలికైన పానీయం. జీర్ణం అవడం సులభం. ఇది పూర్తిస్థాయి వేసవి పానీయం. అందుకే బటర్ మిల్క్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఆయుర్వేదంలో దీనిని సాత్విక ఆహారంగా వర్ణించారు. బటర్ మిల్క్ ఆమ్లత్వంతో పోరాడటానికి సహాయపడుతుంది.

మంచి మసాలాతో భోజనం చేసిన తర్వాత గ్లాసెడు బటర్ మిల్క్ కడుపుకి మంచి ఉపశమనంగా  పనిచేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారంలో కాల్షియంను జోడిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది, తక్కువ కేలరీలతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

లస్సీ అనేది పెరుగుతో చేసే పానీయం. దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగుకు కొద్దిగా ఉప్పు లేదా చక్కెరతో కలిపి లస్సీని తయారు చేస్తారు. ఇక దీని రుచిని పెంచడానికి ఈ లస్సీకి పండ్లు, మూలికలు, ఇతర సుగంధ ద్రవ్యాలను జోడిస్తారు. ఇది ఫిల్లింగ్ డ్రింక్, జీర్ణక్రియకు సహాయపడుతుంది, కడుపు సమస్యలను నివారిస్తుంది, గట్ ఆరోగ్యానికి మంచిది, రోగనిరోధక శక్తిని, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మరి ఈ రెండింట్లో బరువు తగ్గడానికి ఏది మంచిది? అంటే.. అందరూ చెప్పేమాట ప్రధానంగా బరువు తగ్గడానికి మజ్జిగ సరైన ఛాయిస్ అనే. మజ్జిక తేలికైనది, ఆరోగ్యకరమైనది. ఇందులో విటమిన్లు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉన్నందున, బరువు తగ్గించే లక్ష్యాలకు ఆటంకం కలిగించదు కాబట్టి.. రోజుకు ఒకటికంటే ఎక్కువ గ్లాసులు కూడా తాగొచ్చు. 

ఈ మజ్జిగను ఈజీగా తయారు చేసుకోవచ్చు. మసాలా చాచ్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే.. 1 కప్పు సాదా పెరుగు, 1 పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, కరివేపాకు, జీరా పొడి, నల్ల ఉప్పు, చాట్ మసాలా తీసుకోవాలి.

వీటన్నింటినీ మిక్సీలో వేసి బాగా తిప్పండి. దీనికి ఒక కప్పు నీరు చేర్చి మళ్లీ మిక్సీ వేసి.. ఈ మిశ్రమాన్ని చల్లబరచడానికి ఫ్రిజ్ లో పెట్టి...తరువాత తాగండి. 

ఈ మజ్జిగను ఈజీగా తయారు చేసుకోవచ్చు. మసాలా చాచ్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే.. 1 కప్పు సాదా పెరుగు, 1 పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, కరివేపాకు, జీరా పొడి, నల్ల ఉప్పు, చాట్ మసాలా తీసుకోవాలి.

వీటన్నింటినీ మిక్సీలో వేసి బాగా తిప్పండి. దీనికి ఒక కప్పు నీరు చేర్చి మళ్లీ మిక్సీ వేసి.. ఈ మిశ్రమాన్ని చల్లబరచడానికి ఫ్రిజ్ లో పెట్టి...తరువాత తాగండి. 

Latest Videos

click me!