కాఫీతో ఇన్ని ప్రయోజనాలా.. ప్రపంచవ్యాప్తంగా కాఫీకి ఇంతమంది అడిక్ట్ అయ్యారా?

First Published Oct 1, 2021, 5:49 PM IST

అక్టోబర్ 1, నేడు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ఉదయం లేవగానే ఒక చిక్కటి కాఫీ తాగితే ఆరోజు ఎంత అందంగా ఉంటుందో కాఫీ ప్రియులను అడిగితే తెలుస్తుంది.

అక్టోబర్ 1, నేడు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ఉదయం లేవగానే ఒక చిక్కటి కాఫీ తాగితే ఆరోజు ఎంత అందంగా ఉంటుందో కాఫీ ప్రియులను అడిగితే తెలుస్తుంది. తీరికలేకుండా గడుపుతూ ఒత్తిడికి గురైనప్పుడు ఒక చక్కటి కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుంది. 

నిరాశగా ఉన్నప్పుడు, బాధాగా ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే మూడ్ మారిపోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కాఫీ మూడ్ మార్చడానికి ఉపయోగపడుతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. 

డిప్రెషన్ కు గురైనప్పుడు కప్పు కాఫీ తీసుకుంటే మూడ్ మారి సంతోషంగా మారుతారని అధ్యయనాలు చెప్తున్నాయ్. అంతేకాదు కాఫీ తాగేవారు ఎంతో సంతోషంగా, ప్రతిఒక్కరితో స్నేహంగా, ప్రశాంతంగా ఉంటారని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయ్. 

డిప్రెషన్ గురైనవారు రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే యాక్టీవ్ గా అవుతారని చెప్తున్నారు. అంతేకాదు.. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, మధుమేహం వంటి వాటిని దూరం చేస్తాయ్. కాఫీలో ఉండే 'క్లోరోజెనిక్ యాసిడ్' అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 
 


2018లో చేసిన అధ్యయనం ప్రకారం ప్రతిరోజు కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఆరు శాతం తక్కువని తేలింది. అంతేకాదు కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యం ఎక్కువని తేలింది. 

కాఫీకి, మెదడు పనితీరుకు మధ్య లింక్ ఉందని, మూడ్ ని త్వరగా కాఫీ మార్చగలదని తేలింది. అది మాత్రమే కాదు కాఫీ మెదడులో దీర్ఘకాలికంగా కొన్ని మార్పులు జరుగుతాయని, పార్కిన్సన్స్ అనే వ్యాధిని నివారించడంలో కాఫీ సహాయపడుతుందని తేలింది. 

కాఫీ తాగడం వల్ల వ్యాయామం ఎంతో ఉత్సాహంగా చేయగలరని, దీని ప్రభావంగా శారీరకంగాను ఉంటుందని చెబుతున్నారు. కాఫీ కండరాల నొప్పిని తగ్గిస్తుంది కూడా. చూశారుగా.. కాఫీ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయ్యో.. మరి ఇంకెందుకు ఆలస్యం రోజుకో కప్పు కాఫీ తాగండి ఆరోగ్యంగా మారండి. 

click me!