కనుబొమ్మల్లో నొప్పిగా ఉంటోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

First Published Nov 25, 2022, 4:58 PM IST

కనుబొమ్మల నొప్పికి కారణాలెన్నో ఉంటాయి. ఒత్తిడి ఎక్కువైతే కూడా కనుబొమ్మల్లో నొప్పి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే కనుబొమ్మల నొప్పిని తగ్గించుకోవచ్చు.
 

కళ్లు, కను బొమ్మల్లో వచ్చే నొప్పి కొన్నికొన్ని సార్లు భరించలేనంతగా ఉంటుంది. ఈ నొప్పికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా ఈ నొప్పి కనుబొమ్మల చుట్టూ లేదా కనుబొమ్మల కింద వస్తుంది. ఈ నొప్పి తలనొప్పి వంటి వివిధ కారణాల వల్ల కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు కనుబొమ్మల నొప్పి ఎందుకు వస్తుంది..? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image: Getty Images

తలనొప్పి

ఒత్తిడి వల్ల తలనొప్పి రావడం సర్వసాధారణ విషయం. ఈ రకమైన నొప్పి ఒత్తిడి లేదా నిద్ర లేకపోవడం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇది కనుబొమ్మల్లో నొప్పికి దారితీస్తుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి. అలాగే రాత్రిళ్లు ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపోయేలా చూసుకోండి. 
 

మైగ్రేన్

మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి. దీనివల్ల కనుబొమ్మలలో నొప్పి వస్తుంది. ఇది థ్రోబింగ్ నొప్పి రూపంలో ఉంటుంది. సాధారణంగా ఇది తలకు ఒక వైపు మాత్రమే వస్తుంది. ఈ మైగ్రేన్ నొప్పిని సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. పరిస్థితి మరింత దిగజారుతుంది. 
 

క్లస్టర్ తలనొప్పి

క్లస్టర్ తలనొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. ఈ క్లస్టర్ తలనొప్పి రోజులో రెండు సార్లకంటే ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి 3 గంటల పాటు కూడా ఉండొచ్చు. ఈ నొప్పి అకస్మత్తుగా వస్తుంది. ఈ నొప్పి వల్ల నిద్రకూడా పట్టదు. ఇది సాధారణంగా తలకు ఒక వైపున వస్తుంది. ముఖ్యంగా కంటి చుట్టూ ఉంటుంది. 
 

సైనసిటిస్

సైనస్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలువబడే సైనసైటిస్ వల్ల కూడా కనుబొమ్మల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీనిలో ముక్కు, బుగ్గల చుట్టూ, నుదిటిపై దారుణంగా నొప్పి పుడుతుంది. జలుబు, అలర్జీ, పంటి సంక్రామ్యత లేదా నాసికా గాయాల కారణంగా నాసికా మార్గం మూసుకుపోయినప్పుడు సైనస్ సంక్రామ్యత సంభవిస్తుంది. సైనసైటిస్ ముఖం నొప్పి లేదా కళ్ళలో వాపునకు దారితీస్తుంది. ఇది కనుబొమ్మలను ప్రభావితం చేస్తుంది.

కనుబొమ్మల నొప్పిని తగ్గించే చిట్కాలు

- సాధ్యమైనంత వరకు విశ్రాంతిని ఎక్కువగా తీసుకోండి. నిద్ర సరిగ్గా పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

- మీ కనుబొమ్మలపై కోల్డ్ కంప్రెస్ అప్లై చేసి పడుకోండి. ఇది మీకు నొప్పిని నెమ్మదిగా తగ్గిస్తుంది.

- ధ్యానం చేయడం వల్ల మనస్సుపై తక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కనుబొమ్మల నొప్పి తగ్గుతుంది. 

- చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్న గదిలో పడుకోండి. వెలుతురు మీ సమస్యను పెంచే అవకాశం ఉంది. ఇలాంటి గదిలో పడుకోవడం వల్ల మీకు మరింత మనశ్శాంతి లభిస్తుంది.

- ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే పద్ధతులను ఫాలో అవ్వండి. అది సంగీతం, నృత్యం లేదా మరేదైనా కావొచ్చు. ఒత్తిడి తగ్గితే ఎలాంటి తలనొప్పి లేదా కనుబొమ్మల నొప్పి ఉండదు.

- అలెర్జీలను నివారించడం వల్ల కనుబొమ్మల నొప్పి నుంచి బయటపడతారు. 

click me!