Weight Loss: కొండచిలువ రక్తంతో.. ఎంత బరువైనా తగ్గొచ్చా..?

Published : Mar 24, 2026, 12:07 PM IST

 Weight Loss: కొండచిలువలు( Python) తమ శరీర బరువులో సగం కంటే ఎక్కువ బరువు ఉన్న ఆహారాన్ని తిని, ఆ తర్వాత నెలల తరపడి ఏమీ తినకుండా ఉండగలవు. ఈ కొండచిలువలే ఇప్పుడు మనిషి అధిక బరువు సమస్యకు పరిష్కారంగా మారబోతున్నాయి.. 

PREV
13
అధిక బరువుకు చెక్..

Weight Loss: ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు.`భారత దేశంలో కూడా ప్రతి నలుగురిలోనూ ఒకరు అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా, బరువు తగ్గడానికి సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అయితే.. ఎన్ని మార్పులు చేసుకున్నా కూడా తమ అధిక బరువును మాత్రం తగ్గించుకోలేకపోతున్నాం అని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. అలాంటి సమస్యకు పరిష్కారం దొరికినట్లే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అవును... కొండచిలువల రక్తంతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది కూడా బర్మీస్ జాతికి చెందిన కొండచిలువల రక్తంలో ఉండే ప్రత్యేక అణువులు భారీ బరువు తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

23
పరిశోధనలో ఏం తేలిందంటే...

ఆకలిని నియంత్రించే అణువులు: కొండచిలువ రక్తంలో గుర్తించిన ఒక అణువు ఎలుకలలో ఆకలిని తగ్గించి, బరువు తగ్గేలా చేయడంలో సఫలీకృతం అయ్యింది. ఇది మనుషులలో కూడా కొత్త రకం బరువు తగ్గించే చికిత్సలకు దారితీసే అవకాశం ఉంది.

బలహీనపడకుండా బరువు తగ్గడం.. సాధారణంగా బరువు తగ్గితే కండరాలు క్షీణించి శరీరం బలహీనపడుతుంది. కానీ, కొండచిలువల్లోని ఈ అణువు కండరాల శక్తిని తగ్గించకుండా కేవలం అనవసరమైన కొవ్వును మాత్రమే కరిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

33
కొండచిలువ జీవితం ఎలా ఉంటుందంటే..

వేగవంతమైన జీవక్రియ.. కొండచిలువ తన బరువుకు సమానమైన జంతువును మింగినప్పుడు దాని జీవక్రియ అకస్మాత్తుగా వేగవంతమౌతుంది. దాని గుండె, కాలేయం వంటి అవయవాల పరిమాణం కూడా తాత్కాలికంగా పెరుగుతుంది.

నెలల తరబడి ఉపవాసం.. కొండచిలువ ఒక్కసారి ఆహారం తీసుకుంటే.. కొన్ని నెలల పాటు ఎలాంటి ఆహారం లేకపోయినా జీవించగలవు. దీనికి కారణం వాటిలో ఉండే ఒక ప్రత్యేక హార్మోన్. ఈ హార్మోన్ మనుషులలో ఉండదు. అంతేకాదు.. సహజంగా ఆహారం లేని సమయంలో ఇతర జంతువులు బలహీనపడతాయి. కానీ, కొండ చెలువలు తమ కండరాలను, శక్తిని కోల్పోవు.

మానవులపై ప్రయోగాలు ఎప్పుడు..?

ప్రస్తుతానికి ఈ పరిశోధన ప్రాథమిక దశలోనే ఉంది. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతం అయినప్పటికీ, మనుషలపై వీటిని పరీక్షించడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం పీచుపదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల సహజంగా ఆకలిని నియంత్రించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories