Bird Flu: బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ తింటే మనుషులకు కూడా వస్తుందా? లక్షణాలు ఇవే

Published : Feb 15, 2025, 11:38 AM IST

తెలిసో తెలియకనో.. ఇప్పుడు  ఆ వైరస్ సోకిన చికెన్ తిన్నారో.. మనకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది.

PREV
15
Bird Flu: బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ తింటే మనుషులకు కూడా వస్తుందా? లక్షణాలు ఇవే

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడుతున్న పేరు బర్డ్ ఫ్లూ.  ఈ బర్డ్ ఫ్లూ వైరస్ పేరగానే చికెన్ ప్రియుల గుండెలు బద్దలైపోయాయి అని చెప్పొచ్చు.  ప్రతిరోజూ ముక్క లేనిదే తమకు ముద్ద దిగదు అని చెప్పుకునే వాళ్లంతా.. ఇప్పుడు ఆ ముక్క కు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంంటే.. బర్డ్ ఫ్లూ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికక్కడ కోళ్లు చచ్చిపోతున్నాయి. తెలిసో తెలియకనో.. ఇప్పుడు  ఆ వైరస్ సోకిన చికెన్ తిన్నారో.. మనకు కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది.

25

చాలా మంది కోళ్లకు వచ్చిన ఆ  వైరస్ మనకు ఎందుకు వస్తుంది లే అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ.. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని తినడం వల్ల,... మనకు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ప్రభుత్వాలు కనీసం రెండు వారాలు అయినా చికెన్ తినడం మానేయమని మొత్తుకుంటున్నాయి. అయినా..ప్రభుత్వం మాటలు వినిపించుకోకుండా చికెన్ తినేవాళ్లు లేకపోలేదు. మరి..  నిపుణులు ఏమంటున్నారు..? మనకు బర్డ్ ఫ్లూ నిజంగా వస్తుందా? వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి..? చికెన్ ఎలా తింటే ఆ వైరస్ మనకు సోకదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

35
bird flu

బర్డ్ ఫ్లూని ఇన్ఫ్ల ఎంజా అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. పక్షులకు మాత్రమే సోకుతుంది. అయితే.. ఆ పక్షుల నుంచి దానిని తినడం వల్ల మనుషులకు, జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉంది. మనుషులకు సోకినప్పుడు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

45
chicken

మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు...
జ్వరం
దగ్గు
గొంతు మంట
కండరాల నొప్పులు
అలసట
శ్వాసకోశ ఇబ్బందులు
తీవ్రమైన సందర్భాల్లో, ఫ్లూ న్యుమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అవయవ వైఫల్యం , మరణానికి కూడా దారితీయవచ్చు. వీటిలో ఎలాంటి లక్షణాలు కనపడినా వెంటనే వైద్యలను సంప్రదించడం ఉత్తమం.

55

బర్డ్ ఫ్లూ వేళ చికెన్ ని ఎలా తినాలి?

ప్రస్తుతం బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది కాబట్టి.. ఈ సమయంలో చికెన్ లాంటివి తినకపోవడమే మంచిది. లేదు... మేం తినాల్సిందే అంటే కొన్ని నియమాలు పాటించాలి. కోడిని బాగా ఉడికించి తినాలి. ముఖ్యంగా 165 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉడికించి తినడం వల్ల ఆ  వైరస్ చనిపోతుంది. అలాంటి సమయంలో.. మీరు చికెన్ తిన్నా ఎలాంటి భయం ఉండదు. చికెన్ మాత్రమే కాదు.. కోడి గుడ్డును కూడా ఉడికించి తినడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories