రెగ్యులర్ గా మునగాకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్త పోటు సమస్య ఉండదు. అంతేకాదు.. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల... ఈ మునగాకులో విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఫలితంగా.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చర్మం మృదువుగా, అందంగా కనపడేలా చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మునగాకులోని బలమైన యాంటీఆక్సిడెంట్ కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అనారోగ్యాలు , ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో శరీరానికి సహాయపడుతుంది. క్వెర్సెటిన్ , క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ముఖ్యమైన పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.