Diabetes Diet: షుగర్ పేషెంట్లు పైనాపిల్ ను తినొచ్చా? లేదా?

Published : Jul 24, 2022, 03:58 PM ISTUpdated : Jul 24, 2022, 04:13 PM IST

Diabetes Diet: షుగర్ పేషెంట్లు తమ రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోవాలి. లేదంటే శరీర అవయవాలపై చెడు ప్రభావం పడుతుంది.   

PREV
19
Diabetes Diet: షుగర్ పేషెంట్లు పైనాపిల్ ను తినొచ్చా? లేదా?

షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఇతరులకంటే కాస్త ఎక్కువగానే ఉంటాయి. వీటిని నియంత్రణలో ఉంచుకోకపోతే శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతుంది. ఈ షుగర్ వ్యాధి  కంటి  సమస్యలకు, మూత్రపిండాల సమస్యలకు, గుండె సంబంధిత రోగాలకు దారితీస్తుంది. అందుకే డయాబెటీస్ ను ఎల్లప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోవాలి. 

29

షుగర్ పేషెంట్లు తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అందుకే వీరి ఆరోగ్యానికి ఏవి మంచివి.. ఏవి కావు అన్న విషయాలను తెలుసుకోవాలి.  అయితే పుల పుల్లగా.. తియ్య తియ్యగా ఉండే పైనాపిల్ ను మధుమేహులు తినాలో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

39

పైనాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు

పైనాపిల్ లో ఖనిజాలు, ఫైబర్, వివిధ రకాల విటమిన్లు,  మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండును తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే వాపు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాగా ఇతర పండ్లతో పోల్చితే ఈ పండు మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. 

49

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహులు పైనాపిల్ పండును మోతాదుకు మించి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పండులో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే గ్లైసెమిక్ ఇండెక్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు దీన్ని పరిమితిలోనే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గ్లైసెమిక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే షుగర్ లెవెల్స్ దారుణంగా పెరుగుతాయి. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను మధుమేహులు తినకూడదు. 

59

ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ పైనాపిల్ లో 51 నుంచి 73 మధ్యలో ఉంటుంది. ఒకవేళ పైనాపిల్ పండును తినాలనుకున్నా 100 గ్రాముల కు మించి తినడం వీరి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను విపరీతంగా పెంచుతుంది. 

69
pineapple

మధుమేహులకు పైనాపిల్ తో కలిగే ప్రయోజనాలు

పైనాపిల్ పండులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. దీన్ని తినడం వల్ల  ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.అంతేకాదు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడుతుంది. 
 

79

ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతుంది. అందుకే దీన్ని తరచుగా తింటూ ఉండాలి. 

89

ఈ పండులో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే దివ్య ఔషదగుణాలు కూడా ఉంటాయి. కానీ దీన్ని షుగర్ పేషెంట్లు మాత్రం మితంగానే తినాలి. 

99

పైనాపిల్ ను మోతాదులో తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పండు తింటే మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.  

Read more Photos on
click me!

Recommended Stories