నిర్మ‌లమ్మ చీర‌ల సెల‌క్ష‌న్ ఎంత సూపరో..!

First Published | Feb 1, 2024, 3:06 PM IST

ఈ రోజే  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. అయితే ప్రతి బడ్జెట్ సమావేశంలో ఆమె కట్టుకున్న చీరలు హైలైట్ అవుతుంటాయి. నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరలకు,  బడ్జెకు లింక్ పెడుతుంటారు. కానీ నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరలు అందంగా, చూడముచ్చటాగా ఉంటాయి. ఇలాంటి చీరలను మీరు ఎన్నో ఫంక్షన్లకు కూడా కట్టుకెళ్లొచ్చు తెలుసా? 
 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వయసు 64 ఏండ్లు. అయినా ఆమె వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె కట్టుకునే చీరలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చీరల్లో నిర్మలా సీతారామన్ చూడముచ్చటగా ఉంటారు. ఇలాంటి చీరలను మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ చీరలను ప్రత్యేకమైన ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు కట్టుకెళ్లొచ్చు. అందుకే ఈరోజు నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరలను చూసేద్దాం.. 
 

ఆకుపచ్చ చీర 

నిర్మలా సీతారామన్ ఆకుపచ్చ రంగు చీరలో వైభవంగా కనిపించారు. ఈ చీరకు బ్రౌన్ కలర్ బోర్డర్ ఉంది. నిర్మలా సీతారామన్ కట్టుకున్న ఈ చీరను మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ రకం చీరలను మీరు ఇంటి ఫంక్షన్ లకు కట్టుకోవచ్చు.  
 


 బ్లూ చీర

నిర్మలా సీతారామన్ ముదురు నీలం రంగులో మెరిసే అందమైన చీరను ధరించారు. ఈ చీర మీదికి ఆమె ఫుల్ స్లీవ్స్ తో కూడిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించారు. అలాగే ఎరుపు రంగు శాలువాను జత చేస్తారు.
 

పసుపు రంగు చీర 

నిర్మలా సీతారామన్ పసుపు రంగు చీరలో కూడా కనిపించారు. దీనితో మ్యాచింగ్ హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్ ను ధరించారు. ఈ చీరలో ఆమె అందంగా కనిపించారు. మీరు కూడా ఈ చీరను రీక్రియేట్ చేసి ధరించొచ్చు.
 

nirmala sitaraman

పర్పుల్ కలర్ చీర

నిర్మలా సీతారామన్ పర్పుల్ కలర్ పోల్కా డాట్ చీరను ధరించారు. ఆమె ఆ చీరకు సరిపోయే బ్లౌజ్ ను సెలక్ట్ చేసుకున్నారు. ఈ సింపుల్ లుక్ లో కూడా ఆమె చాలా అందంగా కనిపించింది. 
 

డబుల్ షేడ్ చీర

నిర్మలా సీతారామన్ నీలం రంగు చీరలో చూడముచ్చటగా కనిపించారు. గ్రే కలర్ హైనాక్, బ్లూ కలర్ షాల్ కూడా దీనికి జతచేశారు. ఈ తరహా డబుల్ షేడ్ చీర ఫంక్షన్ కు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. 
 

nirmala sitaraman

తెలుపు చీర 

నిర్మలా సీతారామన్ తెలుపు రంగు చీరకు భిన్నంగా ఎరుపు రంగు బ్లౌజ్ ధరించారు. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ చీరతో డిఫరెంట్ బ్లౌజ్ ను కూడా జత చేసుకోవచ్చు. ఇది కూడా మీ లుక్ ను పెంచుతుంది. 

బ్రౌన్ చీర 

నిర్మలా సీతారామన్ పసుపు రంగు బోర్డర్ వర్క్ ఉన్న బ్రౌన్ కలర్ చీరలో మెరిశారు. అయితే ఈ చీరమీదికి ఆమె పసుపు రంగు సింపుల్ బ్లౌట్ ను ధరించారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలాంటిది మీరు కూడా ట్రై చేయొచ్చు.

బ్రౌన్ చీర 

నిర్మలా సీతారామన్ పసుపు రంగు బోర్డర్ వర్క్ ఉన్న బ్రౌన్ కలర్ చీరలో మెరిశారు. అయితే ఈ చీరమీదికి ఆమె పసుపు రంగు సింపుల్ బ్లౌట్ ను ధరించారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలాంటిది మీరు కూడా ట్రై చేయొచ్చు.

Latest Videos

click me!