ఈ గేమ్స్ మీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి.. ఆడుతున్నారా మరి..?

First Published Sep 30, 2022, 11:55 AM IST

మెదడు ఆరోగ్యంగా ఉండేనే మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. మెదడు ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా.. దాని పరిణామాలు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా మెమోరీ పవర్ తగ్గుతుంది. శరీర విధులు సక్రమంగా జరగవు. 
 

మన మెదడు శరీరంలోని అన్ని భాగాలకు సంకేతాలను పంపుతుంది. వాటితోనే అవి ప్రతిస్పందించి విధులను సక్రమంగా నిర్వహిస్తాయి. ఇవన్నీ మెదడు ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే. ఒక వేళ మీ బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటే మీ శరీరం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మరి బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 

మీ బ్రెయిన్  ను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే.. మీ లైఫ్ స్టైల్ మొత్తం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. ఏ పనిచేయకూడదు, ఏ పనిచేయాలి వంటివి మన మెదడే మనకు సంకేతాలనిస్తుంది. 
 

మెదడు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే మంచి ఆహారాలతో పాటుగా వ్యాయామం కూడా అవసరమే. అయితే కొన్ని రకాల గేమ్స్ ను ఆడితే మీ  మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. అంతేకాదు అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా తగ్గిపోతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..

క్రాస్ వర్డ్ పజిల్

మీ బ్రెయిన్ ను షార్ప్ గా  ఉంచాలనుకుంటే క్రాస్ వర్డ్ పజిల్ మీకు ఎంతో సహాయపడుతుంది. దీనిని క్లాస్ పజిల్ అని కూడా అంటారు. క్రాస్ వర్డ్ పజిల్ అనేది ఒక రకమైన గేమ్.  ఈ గేమ్ లో మనం పదాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది మన మెమరీ పవర్ ని పెంచుతుంది. అల్జీమర్స్ లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి  సమస్యలను తగ్గించడానికి ఈ క్రాస్ వర్డ్ పజిల్ ఎంతో సహాయపడుతుంది. 
 

సూడోకు

సుడోకు కూడా మెదడు కణాలను చురుగ్గా ఉంచే ఆట. రెగ్యులర్ గా సుడోకును ఆడటం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సుడోకు మెదడును ఉత్తేజపరుస్తుంది. అలాగే మీ ఆలోచనా సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
 


చదరంగం 

చదరంగం ఏకాగ్రతను పెంచడానికి, మెదడు షార్ప్ గా చేయడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. చదరంగం ఆటలో మీరు అవతలి వ్యక్తి మనస్తత్వాన్ని గ్రహించాలి. అప్పుడు మాత్రమే మీరు అవతలి వ్యక్తిని ఓడిస్తారు. ఇలా చేయడం ద్వారా మీరు మనస్సును మీరు అదుపులో ఉంచుకోగలుగుతారు.

చదరంగం మీ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. మీ ఆలోచనా శక్తిని పెంచడనికి సహాయపడుతుంది. ఒకసారి ఈ గేట్  ఆడటానికి మీరు అలవాటు పడితే .. మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేయడం మొదలవుతుంది. ఇది ఏదైనా విషయం గురించి బాగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుతుంది. చాలా మంది ఒంటరిగా కూడా ఈ గేమ్ ను ఆడతారు. ఇది మెదడుకు వ్యాయామంలా పనిచేస్తుంది. ఇది అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

Scramble

మెదడు  శక్తిని పెంచే చాలా ప్రసిద్ధ ఆట స్క్రాంబుల్. ఈ ఆట మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆట ఒకే సమయంలో ఎన్నో విషయాల గురించి ఆలోచించే సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. 

click me!