మీలోని శృంగారకోరికల్ని మీ శ్వాస పట్టించేస్తుంది.. ఇది మీకు తెలుసా...

First Published | May 5, 2022, 2:07 PM IST

మీ శ్వాస మీలోని శృంగార కోరికను పట్టిస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా మీకు ఎవరిమీదైనా క్రష్ ఉంటే.. లేదా ఇష్టపడిన వ్యక్తి ఎదురుపడితే మీ శ్వాసలో తేడా వస్తుందట.. అదే మిమ్మల్ని పట్టించేస్తుందట. అయితే ఇది ఒకరకంగా మంచిదే అంటున్నారు నిపుణులు. 

కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం, టెలిగ్రాఫ్ UK నివేదికల ప్రకారం, మీరు లైంగికంగా ప్రేరేపించబడినప్పుడు మీ శ్వాస రసాయన క్రియలో మార్పు వస్తుంది. ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి, పోర్టో విశ్వవిద్యాలయం, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ ద్వారా ఈ ప్రాజెక్ట్ కోసం 24 మంది వాలంటీర్లను నియమించారు. దీనికోసం శ్వాసలోని రసాయనాన్ని నమోదు చేసే కొన్ని మాస్క్‌లు వీరికి ఇచ్చారు. 

వీరిని లైంగిక ఆసక్తిని రేకెత్తించే సంకేతాలను గుర్తించగల సెన్సార్‌లతో పర్యవేక్షించారు. భయంకరమైన దృశ్యం, స్పోర్ట్స్ ఈవెంట్, థోర్డ్ ఎరోటిక్ ఫిల్మ్ లాంటి కొన్ని వీడియోలను వారితో చూపించారు. ఇక శృంగారభరిత చిత్రం చూస్తున్నపుడు వారి శ్వాసలోని రసాయనక్రియ వెంటనే మారిపోయింది.


అయితే, ఈ రసాయనమార్పు ఎదుటివారిని ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతుందో ఇంకా చెప్పలేం అని వారు తెలిపారు.కాకపోతే శ్వాసలోని రసాయనంలో మార్పు వాస్తవమేనని అన్నారు. 

మామూలుగా ఇద్దరు ముద్దు పెట్టుకుంటుంటే చూస్తే మనలో ఏదో తేడా జరగుతుంటుంది. అది మనం కూడా అనుభూతి చెందుతాం. శ్వాస బరువెక్కుతుంది. అయితే మన శ్వాసలోని రసాయనిక చర్యలో మార్పు జరగుతుందా? అది రహస్యంగా ఎదుటి వారితో మాట్లాడుతుందా? అనేది తెలుసుకోవాల్సి ప్రశ్న.

భయం కలిగినప్పుడు శరీరంలోని అణువణువలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేలాది అధ్యయనాలు ఉన్నాయి. కానీ చాలా తక్కువగా మాత్రమే శృంగార కోరికలు కలిగినప్పుడు జరిగే మార్పుల మీద అధ్యయనాలు ఉన్నాయని.. పరిశోధకులు చెబుతున్నారు. 

లైంగిక పరమైన అంశాలమీద అధ్యయనాలు అంత తొందరగా ముందుకు రారని పరిశోధకులు అంటున్నారు. అయితే శ్వాసలోని ఈ రసాయనమార్పును గురించి మరింతగా ప్రయోగాలు చేయాలని వారు చెబుతున్నారు. ఈ పరిశోధనలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.

Latest Videos

click me!