మధుమేహులు పాలలో ఇవి కలుపుకుని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి..

First Published Aug 16, 2022, 12:40 PM IST

షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. అది జీవితాంతం మీతోనే ఉంటుంది. దీనిని పూర్తిగా తగ్గించుకోవడం అసాధ్యం. అందుకే దీనిని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
 

మధుమేహులు ఆహారం విషయంలో  చాలా శ్రద్ధగా ఉండాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి వంటి ప్రాణాంతక రోగాల బారిన పడతారు. గ్లూకోజ్ స్థాయిలు సక్రమంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. కానీ ఇది అంత సులువు కాదు. అయితే పాలలో కొన్ని రకాల పదార్థాలను కలుపుకుని తాగడం వల్ల రక్తంలో

పసుపు

భారతీయ వంటకాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే కంటెంట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయగపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చి పసుపు పొడిని తీసుకుని గ్లాస్ పాలలో మిక్స్ చేసి తాగాలి. ఈ పాలను తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటుగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతు వాపు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
 

దాల్చిన చెక్క

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దాల్చిన చెక్క కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో Bioactive compounds  కూడా ఉంటాయి. ఒక పరిశోధన ప్రకారం.. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు ఇది దివ్య ఔషదంలా పనిచేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గాలంటే గ్లాస్ పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ను మిక్స్ చేసి తాగాలి. ఇది కొద్ది రోజుల్లోనే షుగర్ లెవెల్స్ ను పూర్తిగా నియంత్రణలో ఉంచుతుంది. 
 

మెంతులు

మెంతులు చాలా చిన్నగా ఉన్నప్పటికీ.. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మధుమేహులకు మెడిసిన్స్ కంటే తక్కువేం కాదు. వీటిలో కరిగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో  ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. 
 

click me!