Sesame Seeds: తెల్ల నువ్వులా? నల్ల నువ్వులా? రెండింటికి తేడా ఏంటి? రెండింటిలో ఏది తినడం మంచిది?

Published : Nov 11, 2026, 10:54 AM IST

Sesame Seeds: నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చలికాలంలో వీటి వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కానీ, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండింటిలో ఏది తీసుకోవడం ఉత్తమం..?

PREV
13
నల్ల నువ్వులా? తెల్ల నువ్వులా?

మన వంటింట్లో ఎప్పుడూ ఉండే నువ్వుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆహారానికి రుచిని, మంచి అరుదైన ఆకృతిని అందించడంలో నువ్వులు ముందు వరసలో ఉంటాయి. అయితే. మార్కెట్లో మనకు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ కనిపిస్తాయి. కేవలం రంగులో తేడా మాత్రమే కాదు.. రుచిలో, వంటకాల్లో వాడే విధానంలో.. ముఖ్యంగా పోషక విలువల్లో తేడా చాలా ఉంది. మరి, ఈ రెండింటిలో వేటిని ఎలా వాడాలి? ఏ నువ్వుల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం...

23
1.రుచి విషయానికి వస్తే...

తెల్ల నువ్వులు: ఇవి తేలికపాటి, సున్నితమైన రుచిని కలిగి ఉంటాయి. సలాడ్లు, బ్రెడ్‌లు, స్టిర్-ఫ్రైస్ వంటి వాటికి ఇది చక్కగా సరిపోతుంది. ఇవి ఇతర పదార్థాల రుచిని డామినేట్ చేయకుండా కలిసిపోతాయి.

నల్ల నువ్వులు: ఇవి మరింత ఘాటైన, లోతైన రుచిని కలిగి ఉంటాయి. ఏషియన్ డెజర్ట్‌లు, సాస్‌లు, మ్యారినేట్ చేసే వంటకాలకు ఇవి ప్రత్యేకమైన టేస్ట్‌ను ఇస్తాయి.

2.ఆకృతి విషయానికి వస్తే...

తెల్ల నువ్వులు: సాధారణంగా వీటి పైపొట్టును తొలగిస్తారు . దీనివల్ల ఇవి కాస్త మెత్తగా, నమలడానికి సులువుగా ఉండి బేకింగ్ ఐటమ్స్‌లో అద్భుతమైన రుచిని అందిస్తాయి.

నల్ల నువ్వులు: ఇవి పొట్టుతో సహా ఉంటాయి. అందుకే ఇవి కొంచెం గరుకుగా, కఠినమైన బైట్‌ను ఇస్తాయి.

మంచి అలంకరణ కోసం...

తెల్ల నువ్వులు ఒక క్లాసిక్ లుక్‌ను ఇస్తే, నల్ల నువ్వులు మాత్రం తెల్లటి అన్నం లేదా క్రీమీ డెజర్ట్‌లపై అద్భుతమైన కాంట్రాస్ట్ లుక్‌ను తెచ్చిపెట్టి రెస్టారెంట్ స్టైల్ అనుభూతిని ఇస్తాయి.

33
నల్ల నువ్వులా? తెల్ల నువ్వులా? ఏది బెస్ట్?

పోషకాల పరంగా చూస్తే మాత్రం నల్ల నువ్వులదే పైచేయి అని చెప్పాలి. ఈ రెండు రకాల నువ్వుల్లోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్ ఉన్నప్పటికీ.. నల్ల నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్‌తో పాటు కాల్షియం మోతాదు కూడా తెల్ల నువ్వుల కంటే ఎక్కువగా ఉంటుంది.యమీరు మీ శరీరానికి ఎక్కువ పోషకాలు, ముఖ్యంగా బలమైన ఎముకల కోసం కాల్షియం అందాలని కోరుకుంటే నల్ల నువ్వులను ఎంచుకోవడం చాలా మంచిది. అయితే, తెల్ల నువ్వులు రోజువారీ సాధారణ వంటకాల్లో వాడుకోవచ్చు. రెండింటినీ కలిపి వాడితే రుచితో పాటు అద్భుతమైన పోషకాలు కూడా అందుతాయి.

నువ్వులను నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నువ్వులలో సహజంగానే నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. వీటిని గాలి తగలని డబ్బాలో, చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ముఖ్యంగా నల్ల నువ్వులు త్వరగా చెడిపోతాయి కాబట్టి, ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో భద్రపరచడం ఉత్తమం. వంటల్లో వాడే ముందు వీటిని చిన్న మంటపై డ్రై రోస్ట్ చేస్తే వాటిలోని సువాసన, రుచి రెట్టింపు అవుతాయి. అయితే మాడిపోకుండా జాగ్రత్తపడాలి, లేదంటే చేదుగా మారుతాయి. కాస్త వేడి చేసి ఆ తర్వాత తింటే పోషకాలు కూడా మీకు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories