లక్ష్మీదేవి స్వరూపం చీపురు...
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ధంతేరస్ రోజున చీపురు కొనడం ఒక అత్యంత శక్తివంతమైన సాంప్రదాయం. చీపురును శ్రీలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇది ఇంట్లోని పేదరికాన్ని, నకారాత్మకతను తుడిచిపెట్టి పరిశుభ్రతను, పాజిటివ్ వైబ్‌ను తెస్తుంది. ఇంటికి మంచి శుభ ఫలితాలను తెస్తుంది.
4. దీపావళి పూజ కోసం: లక్ష్మీ-గణపతి విగ్రహాలు, దీపాలు ధంతేరస్ రోజున లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, ధన్వంతరి దేవుడి అనుగ్రహం కోసం కొత్త విగ్రహాలు లేదా పూజా సామగ్రి కొనడం ఆనవాయితీ. మట్టి, ఇత్తడి లేదా వెండితో చేసిన లక్ష్మీ-గణేశుల చిన్న విగ్రహాలు కొనుగోలు చేయాలి. ఆల్రెడీ ఇంట్లో ఉంటే మళ్లీ కొనాల్సిన అవసరం లేదు.
మట్టి దీపాలు (Diyas) & వత్తులు: దీపావళికి వెలుగులు పంచే సాంప్రదాయ మట్టి ప్రమిదలు, నూనె/నెయ్యి, దూది వత్తులు.
ధనియాలు (Coriander Seeds): ధంతేరస్ నాడు ధనియాలు కొని పూజలో ఉంచడం ఎంతో శ్రేయస్సని భావిస్తారు. పూజ తర్వాత వీటిని తోటలో లేదా కుండీలో నాటుతారు.
గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు: పూజలో పెట్టి బీరువాలో ఉంచడానికి ఇవి అదృష్టాన్ని ఇచ్చే వస్తువులుగా పరిగణిస్తారు. మీ బడ్జెట్ ని పట్టి. వీటిలో ఏవి కొనుగోలు చేసినా.. మీ ఇంటికి శుభం కలుగుతుంది.