Kids Clothes Reuse: పిల్లల బట్టలు పొట్టిగయ్యాయని పారేస్తున్నారా? ఇలా వాడేయండి

Published : Jun 29, 2026, 11:30 AM IST

Kids Clothes Reuse:  పిల్లలు చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటారు. దీంతో, వారి కోసం కొన్న దుస్తులు చాలా తొందరగా  పొట్టిగా అయిపోతూ ఉంటాయి. పొట్టి అయిపోయిన బట్టలను  ఏం చేయాలో తెలీక పారేస్తున్నారా? అయితే.. వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.. 

PREV
16
పిల్లల బట్టలను మళ్లీ ఇలా వాడేయండి..

ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లలకు ఎక్కువ బట్టలు కొనేస్తున్నారు.  వారి అవసరానికి మించి కొనడం వల్ల.. కొన్ని దుస్తులు.. ఒకటి రెండు సార్లు వేసుకోగానే పొట్టిగా అయిపోతూ ఉంటాయి.  పొట్టిగా అయిన వాటిని తిరిగి వేయలేక పారేస్తూ ఉంటాం. లేదంటే.. ఇల్లు శుభ్రం చేయడానికి వాడుతూ ఉంటారు. కానీ..  కొంచెం క్రియేటివిటీ వాడితే… మీ పిల్లల దుస్తులను మరింత అందమైన వస్తువుల్లా మార్చేయచ్చు. 

26
అందమైన దుప్పటిలా...

మీ పిల్లల రకరకాల టీషర్ట్ నుంచి చిన్న చిన్న ముక్కలుగా కత్తింరించి.. వాటితో అందమైన దుప్పటి కుట్టేసుకోవచ్చు. ఇది కుట్టడం చాలా ఈజీ. మీకు సరిగా కుట్టడం రాదు అనుకుంటే.. దగ్గరలో ఉన్న టైలర్ దగ్గర కుట్టించుకోవచ్చు.  ఇలా కుట్టిన దుప్పటిని మీ పిల్లలకే ఇవ్వచ్చు. వాళ్లు కూడా దానిని చూసి హ్యాపీగా ఫీలౌతారు.

36
సాఫ్ట్ టాయ్స్...

పిల్లల బట్టలతో సాఫ్ట్ చేయడం చాలా మంచి ఐడియా.  మీ పిల్లల పాత టీషర్ట్ లేదా పాప ఫ్రాక్ ఉంటే… వాటితో ఒక టెడ్డీ బేర్ లేదా కుషన్ బొమ్మను తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల.. ఆ బొమ్మ చాలా స్పెషల్ గా ఉంటుంది. మీ పిల్లలు ఆ బొమ్మతో చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. దానిని తిరిగి వాష్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. 

46
అందమైన ఫోటో ఫ్రేమ్....

పిల్లల బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఫోటో ఫ్రేమ్ కి అంటించొచ్చు. ఇలా చేయడం వల్ల… నార్మల్ ఫోటో ఫ్రేమ్ కాస్త మరింత అందంగా మారుతుంది. ఆ ఫ్రేమ్ లో మీ పిల్లల ఫోటో పెడితే… చాలా స్పెషల్ గా కనపడుతుంది. మీ ఇంట్లో ఏ గోడకు ఆ ఫోటో పెట్టినా.. చాలా అందంగా కనపడుతుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది.

56
స్టైలిష్ పౌచ్ లేదా బ్యాగ్..

మీరు చిన్న పిల్లల దుస్తులతో ఆకర్షణీయమైన పౌచ్, క్లచ్, హ్యాండ్ బ్యాగ్ లాంటివి తయారు చేయచ్చు. వీటిని రెగ్యులర్ గా చిన్న చిన్న అవసరాల కోసం వాడుకోవచ్చు.  మార్కెట్లో కొనేవాటి కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. 

66
పిల్లల కోసం స్పెషల్ దిండు..

మీ పిల్లల దుస్తుల్లో మీకు బాగా నచ్చిన వాటితో… ఒక మెత్తని దిండును తయారు చేసుకోండి. దానిని సోఫాలో లేదా మంచం మీద పెడితే.. చాలా అందంగా కనపడుతుంది. మీ పిల్లల చిన్ననాటి గుర్తులు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇది చాలా సింపుల్ ఐడియా అయినా.. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories