Chicken Cleaning Tips: నాన్ వెజ్ కడగడానికి పసుపు, ఉప్పును ఎందుకు వాడతారు? సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా?

Published : Oct 01, 2026, 03:47 PM IST

Chicken Cleaning Tips: నాన్ వెజ్ ఏదైనా సరే సరిగ్గా కడకపోతే కూర రుచి రాదు. ఎవరైనా సరే నాన్ వెజ్ ను పసుపు, ఉప్పు వేసి కడగడం అలవాటు. ఇలా చేస్తే నీచు వాసన పోయి ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా?

PREV
15
దీన్ని వల్ల 5 లాభాలున్నాయి

నాన్ వెజ్ ఏదైనా సరే సరిగ్గా కడకపోతే కూర రుచి రాదు. ఎవరైనా సరే నాన్ వెజ్ ను పసుపు, ఉప్పు వేసి కడగడం అలవాటు. ఇలా చేస్తే నీచు వాసన పోయి ముక్కలు మెత్తగా ఉడుకుతాయి.మన ఇళ్లలో చికెన్ తేగానే పసుపు, కల్లుప్పు వేసి కడుగుతారు. బ్యాచిలర్స్ అయినా కూడా ఇదే పని చేస్తారు. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక చాలా ఆరోగ్యకరమైన, సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. చికెన్ కడిగేటప్పుడు పసుపు వాడటం వల్ల కలిగే 5 అద్భుతమైన లాభాలు ఉన్నాయి.

25
యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు

పసుపులో 'కర్క్యుమిన్' (Curcumin) ఉంటుంది. ఇది మాంసంపై ఉండే హానికరమైన బ్యాక్టీరియాను, సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. దీనివల్ల చికెన్ వండుకోవడానికి పూర్తిగా సురక్షితంగా మారుతుంది.

35
నీచు వాసన రాదు

పచ్చి చికెన్ నుంచి ఒక రకమైన నీచు వాసన వస్తుంది. పసుపు, ఉప్పు వేసి కడగడం వల్ల ఆ వాసన పూర్తిగా పోయి, కూరకు మంచి సువాసన వస్తుంది. ముఖ్యంగా నాటుకోడి మాంసం వండేటప్పుడు ఇలా చేయడం చాలా అవసరం. కూర కూడా టేస్టీగా ఉంటుంది.

45
న్యాచురల్ మీట్ టెండరైజర్

చికెన్ ముక్కలపై ఉండే రక్తపు మరకలు, జిడ్డు.. పసుపు-ఉప్పు నీటితో ఈజీగా వదిలిపోతాయి. అంతేకాకుండా పసుపు న్యాచురల్ 'మీట్ టెండరైజర్' లాగా పనిచేస్తుంది. దీనివల్ల ముక్కలు త్వరగా ఉడకడమే కాకుండా చాలా జ్యూసీగా, సాఫ్ట్‌గా తయారవుతాయి.

55
న్యాచురల్ కలర్, మసాలా అబ్జార్ప్షన్

కలర్స్ వాడాల్సిన అవసరం లేకుండానే పసుపు చికెన్‌కు మంచి న్యాచురల్ కలర్ ఇస్తుంది. ముందుగానే పసుపు రాసి కడగడం వల్ల, వండేటప్పుడు వేసే మసాలాలు ముక్కలకు చాలా బాగా పడతాయి. ఇది కేవలం చికెన్‌ను శుభ్రం చేయడానికే కాదు, క్వాలిటీని, రుచిని రెట్టింపు చేయడానికి మన వంటగదిలో దొరికే అద్భుతమైన చిట్కా ఇది.

Read more Photos on
click me!

Recommended Stories