కాఫీని ఏ టైంలో తాగితే మంచిదో తెలుసా?

First Published | Jan 2, 2025, 12:40 PM IST

కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. నిజానికి కాఫీ మనకు వెంటనే శక్తిని అందించి ఎనర్జిటిక్ గా మారుస్తుంది. కానీ ఆరోగ్యం కోసం దీన్ని ఎప్పుడు తాగాలో తెలుసా? 

ఈ ప్రపంచంలో కాఫీని ఇష్టంగా తాగేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కాఫీ మనకు ఒక మంచి శక్తి వనరు. దీన్ని తాగితే నిద్రమత్తు వదిలి శరీరం ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా మారుతుంది. అందుకే చాలా మంది రోజుకు రెండు మూడు సార్లైనా ఖచ్చితంగా తాగుతుంటారు. నిజానికి కాఫీ వల్ల మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఇందుకోసం దీన్ని సరైన సమయంలో తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు కాఫీని ఎప్పుడు తాగితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

శాస్త్రీయ కారణం

కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు.. కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. మీకు తెలుసా? కాఫీ తాగడం వల్ల మనం నిద్రపోయేలా చేసే న్యూరోట్రాన్స్మిటర్ అడెనోసిన్ ను తగ్గిస్తుంది. దీంతో కేంద్ర నాడీ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అంతేకాదు కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. అయితే ఈ కెఫిన్ కంటెంట్ ఏకాగ్రత పెరగడానికి కూడా దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
 


కార్టిసాల్, కాఫీ

కార్టిసాల్ అనేది ఒత్తిడిని కలిగించే ఒక హార్మోన్. ఇది శక్తిని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీర కార్టిసాల్ లెవెల్స్ సిర్కాడియన్ లయను అనుసరిస్తాయి. ఈ లయ ఉదయాన్నే ఎక్కువగా ఉంటుంది. కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న టైంలో కాఫీని తాగకూడదు. 

కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి?

ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు,  మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు కార్డిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో కాఫీని తాగకూడదు. ఈ టైంలో కాఫీని తాగితే  ప్రయోజనాల కంటే సైడ్ ఎఫెక్ట్స్ యే ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ప్రయోజనాలను పొందాలంటే కార్టిసాల్ స్థాయిలు పడిపోయాకే తాగాలి. 
 

కాఫీ తాగడానికి బెస్ట్ టైం ఏంటి?

 కాఫీని మీరు ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య తాగొచ్చు. ఎందుకంటే ఈ టైంలో కాఫీని తాగితే కార్టిసాల్ లెవెల్స్ కొద్దిగా తగ్గి మీ శరీరానికి కొంత శక్తి అందుతుంది. అలాగే మీ ఏకాగ్రత పెరుగుతుంది. 
అలాగే మీరు కాఫీని మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటల వరకు కూడా తాగొచ్చు. మీరు లంచ్ చేసిన తర్వాత కాఫీని తాగితే మీకు నిద్రరాకుండా ఉంటుంది. అలసట కూడా రాదు. 


అలాగే మీరు వ్యాయామానికి ముందు కూడా కాఫీని తాగొచ్చు. అథ్లెట్ లేదా ఫిట్నెస్ ఫ్రీక్, ప్రీ-వర్కౌట్ గా కాఫీ తాగినా లాభాలు పొందుతారు.  ఇందుకోసం మీరు వ్యాయామం చేయడానికి 30-40 నిమిషాల ముందు కాఫీని తాగండి. ఎందుకంటే ఇది మీ ఓర్పును పెంచుతుంది. అలాగే మీ పనితీరును పెంచుతుంది. అలాగే మీ దృష్టిని మెరుగుపరుస్తుంది. 

కాఫీకి బదులుగా ఏం తాగాలి?

ఉదయం:  మీరు ఉదయాన్నే కాఫీకి బదులుగా హెర్బల్ టీని తాగొచ్చు. ఇవి మీ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. 
మధ్యాహ్నం: మధ్యాహ్నం కాఫీని తాగడానికి బదులుగా గ్రీన్ టీని తాగండి. 
సాయంత్రం: సాయంత్రం వేళ డీకాఫినేటెడ్ కాఫీని తాగితే మంచిది. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కాఫీని తాగే టైం మన శరీరం, మనస్సుపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది.కాబట్టి దీన్ని సరైన సమయంలోనే తాగాలి.
 

Latest Videos

click me!