సెప్టెంబర్‌లో తప్పకుండా చూసి తీరాల్సిన భారతీయ అందాలివే.. మిస్ కాకండి

First Published | Aug 29, 2024, 1:38 PM IST

నడి వర్షాకాలంలో పైనుండి రాలే చినుకులను చీల్చుకుంటూ ప్రయాణం చేస్తుంటే ఆ మజాయే వేరు. ట్రావెలింగ్ ను ఇష్టపడేవారు ఈ జర్నీని ఎంతగానో ఇష్టపడతారు, ఇదే సమయంలో కొన్ని ప్రాంతాలు మరింత అందాన్ని సంతరించుకుంటాయి. అలాంటి భారతీయ అందాలను చూసేందుకు సెప్టెంబర్ మాసం చాలా అనువైనది. 

సెప్టెంబర్‌లో భారతదేశం

సెప్టెంబర్ నెల భారతదేశంలోని కొన్ని ప్రకృతి అందాలనే కాదు గొప్ప సంస్కృతిని హైలైట్ చేస్తుంది. సంవత్సరమంతా దాగివుండే అందాలు ఈ వర్షాకాలంలో బయటపడతాయి. ఇలాంటి ప్రాంతాలు భారతదేశంలో అనేకం వున్నాయి. శ్రీనగర్ లోని ప్రశాంతమైన సరస్సుల నుండి ఉదయపూర్ రాజభవనాల వరకు, అమృత్‌సర్ నుండి వారణాసి వరకు ఆద్యాత్మిక శోభను వీక్షించడానికి సెప్టెంబర్ అనుకూలమైనది.  

శ్రీనగర్, జమ్మూ

సెప్టెంబర్‌లో, శ్రీనగర్‌లోని ప్రశాంతమైన సరస్సుల్లో హౌస్‌బోట్‌లో ప్రశాంతంగా ప్రయాణించడం జీవితాంతం గుర్తిండిపోయే అనుభూతిని ఇస్తుంది. దాల్ సరస్సులో ప్రయాణమైతే మరీ అద్భుతంగా వుంటుంది. శ్రీనగర్ సహజ సౌందర్యాన్ని చూసేందుకు ఇది సరైన సమయం.


ఉదయపూర్, రాజస్థాన్

సరస్సుల నగరంగా పేరున్న ఉదయ్ పూర్ లో సెప్టెంబర్ లో మరింత అందంగా కనిపిస్తుంది. వర్షాలతో నిండుకుండల్లా మారిన సరస్సులు,  ఆ పక్కనే అందమైన రాజభవనాలు... ఈ దృశ్యం చూసేందుకు రెండుకళ్లూ చాలవు. తూర్పు వెనిస్ గా పిలుచుకునే ఈ ఉదయ్ పూర్ సహజంగానే అద్భుతమైన అందాలను కలిగివుంటుంది... ఇక సెప్టెంబర్ లో అత్యద్భుతం. 

అమృత్‌సర్, పంజాబ్

సెప్టెంబర్‌లోని వుండే ఆహ్లాదకరమైన వాతావరణం అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయానికి మరింత అందాన్ని అందిస్తుంది. ఈ కాలంలో ఈ దేవాలయ సందర్శన సరికొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. ఇక ఈ నగరం యొక్క గొప్ప కళలు, సంస్కృతి ఆకట్టుకుంటాయి.   

వారణాసి, ఉత్తర ప్రదేశ్

దేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వారణాసి ప్రధానమైనది. ఇక్కడ సహజంగానే ప్రతినిత్యం  ఆధ్యాత్మిక వాతావరణం వుంటుంది... కాబట్టి ఎప్పుడైనా వారణాసిని సందర్శించవచ్చు. కానీ అక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణాన్ని చూాడాలంటే మాత్రం సెప్టెంబర్ మాసం అనువైనది. వర్షకాలంలో నిండుగా ప్రవహించే పవిత్ర గంగానదిలో పడవ ప్రయాణ: సరికొత్త అనుభూతిని ఇస్తుంది. 

Latest Videos

click me!