వైజాగ్ నుంచి సింహాచలం వెళ్లే వాళ్లు ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి..!

First Published Nov 24, 2021, 2:39 PM IST

వైజాగ్ (Vizag) నుండి సింహాచలం (Simhachalam) వెళ్లే మార్గం మధ్యలో అనేక సందర్శక ప్రదేశాలు ఉన్నాయి. ఇవి పర్యాటక ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందులో తప్పక చూడవలసిన కొన్ని సందర్శక ప్రదేశాలు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, రిషికొండ బీచ్, లక్ష్మీ దేవి ఆలయం, సింహవల్లి తాయారు ఆలయం, బొజ్జనకొండ బుద్ధుని స్థూపం. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వైజాగ్ నుండి సింహాచలం వెళ్లే మార్గం మధ్యలోని సందర్శన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం: సింహాచలం అనే గ్రామంలో విశాఖ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతం పైన ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రెండవ సంపన్న దేవాలయంగా చెప్పవచ్చును. ఈ దేవాలయ నిర్మాణంలో ఒరిస్సా (Orissa) ద్రావిడ శైలి కలయిక కనిపిస్తుంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయాలలో ఒకటి. దీనిని సింహగిరి (Simharigi), సింహాచలం అని పిలుస్తారు. ఇక్కడి ఆలయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. 

లక్ష్మీ దేవి ఆలయం: సింహాచలం పొలిమెరలో లక్ష్మీ దేవి ఆలయం (Lakshmidevi temple) ఉంది. ఈ ఆలయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ లోయలు పర్వత శిఖరాలు కలిగి పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ఆలయ ప్రాంగణంలో విష్ణుమూర్తితో సహా అనేక చిన్న చిన్న విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం అనేక శతాబ్దాల క్రితం నిర్మించబడినది. ఇది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన దేవాలయం. ఈ ఆలయంలోని వివిధ విగ్రహాలు చిత్రాలు, చిత్రలేఖనాలు (Paintings) ఆలయ చరిత్రను తెలియజేస్తాయి.

సింహవల్లి తాయారు ఆలయం: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రాంగణంలో సింహవల్లి తాయారు ఆలయం ఉంది. ఈ ఆలయంలో దక్షిణ భారత నిర్మాణ శైలి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఆలయంలోని విగ్రహం సముద్ర మట్టానికి సుమారు 800 అడుగుల ఎత్తులో ఉంది.

ఇక్కడ సింహవల్లి తాయారు కొలువై వున్నది. ఈ దేవాలయంలో వైష్ణవి పండగల సమయంలో ఆచారాలు (Rituals), ధ్యానం (Meditation), ప్రత్యేక ప్రతిపాదన నిర్వహిస్తారు.

బొజ్జనకొండ బుద్ధుని స్థూపం: బొజ్జనకొండ (Bojjanakonda) తూర్పు వైపున ఉన్న కొండ ఇది. ఇక్కడ బుద్ధుని స్థూపం ఉంది. బొజ్జనకొండ అనేది ఒక బౌద్ధ రాతి గుహ. ఇది విశాఖపట్నంలో గల అనకాపల్లి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరం అనే గ్రామం సమీపంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని గొప్ప బౌద్ధ స్థావరాలలో ఇదొకటి. ఇక్కడ అనేక ఏకశిలా స్థూపాలు, రాతి గుహలు (Stone caves), మఠాలు మనకు కనిపిస్తాయి.

రిషికొండ బీచ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల బంగాళాఖాతం తీరంలో ఉన్న వైజాగ్ నగరంలో రిషికొండ బీచ్ (Rishikonda Beach) ఉంది. ఈ బీచ్ రాష్ట్ర పర్యాటక బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది. రిషికొండ బీచ్ బంగారు ఇసుకతో చక్కనైన తరంగాలతో నిండి వుంటుంది.

ఈ బీచ్ పర్యాటక ప్రియులతో నిండి ఉంటుంది. ఈ రిషికొండ బీచ్ ఈత, నీరు స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ లాంటి వివిధ వాటర్ స్పోర్ట్స్ కు అనువైన బీచ్. బీచ్ లో ఆకుపచ్చని మొక్కలు, చెట్లతో అనేక మంది ప్రకృతి ప్రేమికులను, సాహస ప్రేమికులను (Adventure lovers) ఆకర్షిస్తుంది.

click me!