తెల్లగా అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 14, 2021, 04:01 PM IST

తెల్లగా మెరిసిపోవాలనే కోరిక చాలామంది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. చర్మం తెల్లగా మెరిసేందుకు ఆర్టిఫిషియల్ క్రీములు (artificial products) మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీములను వాడుతుంటారు. ఇవి చర్మ సౌందర్యాన్ని తాత్కాలికంగా పెంచినప్పటికీ చర్మం తన సహజ సౌందర్యగుణాన్ని తగ్గిస్తాయి. 

PREV
16
తెల్లగా అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

తెల్లగా మెరిసిపోవాలనే కోరిక చాలామంది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. చర్మం తెల్లగా మెరిసేందుకు ఆర్టిఫిషియల్ క్రీములు (artificial products) మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీములను వాడుతుంటారు. ఇవి చర్మ సౌందర్యాన్ని తాత్కాలికంగా పెంచినప్పటికీ చర్మం తన సహజ సౌందర్యగుణాన్ని తగ్గిస్తాయి. అందం రెట్టింపు, చర్మం తెల్లగా (White Skin) మెరవాలని అనుకుంటున్నారా? అయితే ఇంట్లో చేసుకునే సహజ సిద్ధమైన ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  
 

26

శనగపిండి, పసుపు మరియు చక్కెర: రెండు స్పూన్స్ సెనగపిండి, చిటికెడు పసుపు (Turmeric), ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం తెల్లబడుటకు, మచ్చలను తగ్గించుటకు పనిచేస్తుంది.  

36

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె (Coconut Oil) మాశ్చరైజర్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె ముఖం, శరీర భాగాలపై ఉండే మచ్చలను తగ్గిస్తుంది. కొబ్బరినూనెను మచ్చలు (Pimples), గాయం గుర్తులు ఉన్న ప్రదేశంలో రోజు రాయడం వల్ల మచ్చలు తొలిగిపోయి మంచి ఫలితం కనిపిస్తుంది.    
 

46

పాలు, తేనె నిమ్మరసం: ఒక స్పూన్ పాలు(Milk), తేనె (Honey), నిమ్మరసం (Lemon) తీసుకుని  పేస్ట్ చేయాలి. దీన్ని మీ ముఖానికి మెడ భాగాలకు బాగా పట్టించి 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.       
 

56

ఆరెంజ్ తొక్క పొడి, పెరుగు: ఆరెంజ్ తొక్క పౌడర్ (Orange Peel Powder) , పెరుగును కలిపి పేస్టులా చేసుకోవాలి. మీరు ఈ ఫేస్ ప్యాక్ వేసే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఫేస్ ప్యాక్ (Orange Face Pack) వేసుకొని ఆరిన 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ ముఖంపై ఉన్న ముడతలను తగ్గిస్తుంది. 
 

66

టమోటా, శెనగపిండి: రెండు స్పూన్ ల శనగ పిండి, సగం టమోటో గుజ్జును (Tamota) కలిపి పేస్టులా చేసుకోవాలి. ఇది ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఇక ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ ముఖం పై ఉన్నటువంటి జిడ్డును తగ్గిస్తుంది.

click me!

Recommended Stories