Diabetes: టొమాటోలు (tomatoes) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని మధుమేహులు (Diabetes) తినకూడని కొంతమంది అంటూ ఉంటారు. నిజానికి వీళ్లు తినొచ్చొ? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం..
Benefits Of Tomato For Diabetic Patients: ఈ రోజుల్లో మధుమేహం (Diabetes)సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న వయసు వారు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా వీళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ (Blood sugar levels)విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే చాలా మంది షుగర్ పేషెంట్లు ఏవి తినాలి? ఏవి తినకూడదు? అన్న సందేహాన్ని వ్యక్తపరుస్తుంటారు.
28
అయితే షుగర్ పేషెంట్లు టొమాటో (Tomato)లను తినకూడదని కొంతమంది చెబుతుంటారు. వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నమ్ముతారు. నిజానికి వీళ్లు టొమాటోలను ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తినొచ్చని ఆరోగ్య నిపుణులు (Health professionals) చెబుతున్నారు. ఇందుకోసం వీటిని ఎలా తినాలో తెలుసుకుందాం పదండి..
38
మధుమేహులు టొమాటోలను తినాలా? వద్దా?: టొమాటోలల్లో బీటా కెరోటిన్ (Beta carotene), పొటాషియం (Potassium), విటమిన్ సి (Vitamin C), ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీళ్లు 200 గ్రాముల ముడి టొమాటోలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది.
48
మధుమేహులు టొమాటోలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
టొమాటోలల్లో విటమిన్ సి (Vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని ఎన్నో అంటువ్యాధుల (Infections) నుంచి కాపాడుతుంది. అంతేకాదు ఈ విటమిన్ సి రోగ నిరోధక శక్తి (Immunity)ని కూడా బలోపేతం చేస్తుంది.
58
అలాగే డయాబెటీస్ రోగులకు అనేక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ఈ విటమిన్ సి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ప్రతిరోజూ టొమాటోలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
68
పొటాషియం అధికంగా ఉంటుంది: టొమాటోలల్లో పొటాషియం (Potassium) పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త కణాలను (Blood cells)ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా సహాయపడుతుంది.
78
వీరు టొమాటోలను తినడం వల్ల మరో ఆరోగ్యకరమైన బెనిఫిట్ కూడా ఉంది. క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె (Heart) ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది.
88
టొమాటోలల్లో కేలరీలు (Calories)చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ బరువును నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఓవర్ వెయిట్ (Overweight)తో బాధపడే వారు వీటిని క్రమం తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.