కోవిడ్ ఎఫెక్ట్: స్త్రీపురుషుల మధ్య సెక్స్ తగ్గి, హస్తప్రయోగం పెరిగింది

First Published | Aug 31, 2021, 3:11 PM IST

ఇప్పుడు లాక్ డౌన్ లేకపోయినా.. ఆఫీసులు ఇంకా తెరవకపోవడంతో ఇంకా.. ఇళ్లకే పరిమితమై ఉన్నారు. అయితే.. మొదట్లో ఉన్న సెక్స్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందట. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి నేపథ్యంలో.. గతేడాది మార్చి నుంచి పలు చోట్ల లాక్ డౌన్ విధించారు. అయితే.. ఈ లాక్ డౌన్ అప్పటి నుంచి మనుషుల్లో సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఎలా మారింది అనే విషయంపై  ఓ సంస్థ సర్వే చేయగా.. షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

లాక్ డౌన్ విధించిన మొదట్లో.. ఖాళీగా ఉండటంతో.. అందరూ సెక్స్ పట్ల  ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో.. దంపతులు బాగా ఎంజాయ్ చేశారు.  చాలా మంది ఈ లాక్ డౌన్ పీరియడ్ లో గర్భం కూడా దాల్చారు.


అయితే.. ఇప్పుడు లాక్ డౌన్ లేకపోయినా.. ఆఫీసులు ఇంకా తెరవకపోవడంతో ఇంకా.. ఇళ్లకే పరిమితమై ఉన్నారు. అయితే.. మొదట్లో ఉన్న సెక్స్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందట.  యూబీసీ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

అయితే.. సెక్స్ మీద ఆసక్తి తగ్గి.. హస్త ప్రయోగం మీద చాలా మంది ఫోకస్ పెట్టారట. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.  డైరెక్ట్ గా కలయికను ఆస్వాదించడానికి ఆసక్తి చూపించడం లేదు కానీ..  హస్త ప్రయోగం ద్వారా తృప్తి పొందుతున్నారని ఆ సర్వేలో తేలడం గమనార్హం.

తొలుత.. లాక్ డౌన్ విధించిన సమయంలో.. ఎక్కువ మంది గర్భం దాల్చి.. ప్రసవాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు. ఈ జనన రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ.. అది పూర్తిగా తగ్గిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.


ఎందుకా అని ఆరా తీయగా.. మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకుండా పోయిందట. ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండటం.. భార్యభర్తలు నిత్యం కళ్లెదుటే ఉండటం వల్ల.. దాని మీద వారికి ఆసక్తి తగ్గిపోయిందట.

ఇక ఇంట్లో ఉండి పని చేయడం వల్ల ఒత్తిడి కూడా బాగా పెరిగిపోయిందని.. తద్వారా.. శృంగార ఆసక్తి తగ్గిందని  సర్వేలో తేలిందట. ఏది ఏమైనా హస్త ప్రయోగం వైపు ఆసక్తి చూపుతున్నవారు మాత్రం బాగా పెరిగిపోవడం గమనార్హం. 

Latest Videos

click me!