కాల్షియాన్ని ఇలా తీసుకుంటే మాత్రం మీరు డేంజర్ లో పడతారు జాగ్రత్త..

First Published Sep 4, 2022, 2:09 PM IST

మన శరీరానికి కాల్షియం చాలా అవసరం. కానీ దీన్ని మోతాదుకు మించి తీసుకుంటేనే ఎన్నో తిప్పలొస్తాయి. అందుకే దీన్ని ఎంత మొత్తంలో తీసుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
 

ఏదైనా కానీయండి.. అతి అస్సలు మంచిది కాదు. మంచిదనుకున్నదే విషంగా మారి మనల్ని ప్రమాదంలో పడేస్తుంది. ఇది కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా వర్తిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మనకి అత్యవసరం అయినప్పటికీ.. మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే మీ శరీరం డేంజర్ జోన్ లో పడుతుంది. ఇలాంటి ఆహారాల్లో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఒకటి. కాల్షియం ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది పాలు, జున్ను, చికెన్, మటన్ వంటి ఇతర ఆహారాల ద్వారా లభిస్తుంది. అయితే దీనిని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..
 

మూత్రపిండాలకు హాని 

కాల్షియం పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. నిజానికి శరీరంలో కాల్షియం ఎక్కువైతే.. మూత్రపిండాల ఫిల్టర్ ప్రక్రియ సరిగ్గా జరగదు. మొత్తంగా ఇది వ్యక్తి పని తీరును ప్రభావితం చేస్తుంది. అలాగే కాల్షియం ఎక్కువైతే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది.
 

బోలు ఎముకల వ్యాధి

బోలు ఎముకల వ్యాధి ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి వల్ల ఎముకలలో విపరీతమైన నొప్పి, కీళ్ల అసౌకర్యం కలుగుతుంది. కాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి సమస్య పెరుగుతుంది, ఎందుకంటే ఇది ఎముకలను బలహీనంగా మారుస్తుంది. 
 

చిత్తవైకల్యం

కాల్షియం మోతాదుకు మించి తీసుకోవడం వల్ల చిత్తవైకల్యం సమస్యలు వస్తాయి. ఈ వ్యాధి వల్ల విషయాలను గుర్తుంచుకోలేరు. ఇది మీ మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కాల్షియం ఫుడ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. 
 

గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది

పలు అధ్యయనాల ప్రకారం.. కాల్షియాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని వెల్లడైంది. ఎందుకంటే ఇది గుండె ధమనుల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇదికాస్త గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

మన శరీరానికి కాల్షియం చాలా అవసరం. దీనివల్లే ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఈ కాల్షియం పిల్లలకు రోజూ 1300 నుంచి 1500 మి.గ్రా ఇవ్వొచ్చు. మహిళలు 1200 నుంచి 1500 మి.గ్రా కాల్షియం అవసరం. వృద్ధులకు అయితే ఈ కాల్షియం పరిమాణం 12 నుంచి 1500 మి.గ్రా అవసరం అవుతుంది. పురుషులు 1000 నుంచి 1200 మి. గ్రాముల కాల్షియం తీసుకోవచ్చు.

మనం తినే ఆహారాల్లో కాల్షియం అధికంగా ఉండేవి కూడా ఉన్నాయి. వీటిని మోతాదులోనే తీసుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పాలు, సోయా పాలు, టోఫు, పెరుగు, సోయాబీన్స్, బాదం, జీడిపప్పు, జున్ను, సాల్మన్ చేపల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

click me!