పిల్లలతో మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారా? చెకింగ్ పాయింట్స్ ఇవే....

First Published | Apr 6, 2022, 1:38 PM IST

ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు పద్దతిగా, క్రమశిక్షణతో.. చక్కటి పౌరులుగా ఎదగాలనే చూస్తారు. అయితే ఈ క్రమంలో వారు పెట్టే కొన్ని నియమాలు పిల్లల్ని మరింత ఇబ్బంది పెడతాయి. మీరు అలాంటి పేరెంట్సా.. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 

మితిమీరిన రూల్స్...
చిన్నతనంనుంచే పిల్లలకు రూల్స్ పెట్టడం, క్రమశిక్షన నేర్పించడం మంచిదే. అయితే అవి మరీ ఎక్కువవుతున్నాయా? అనేది గమనించాలి. క్రమశిక్షణ ఎక్కువైతే మీ చిన్నారులు మీరనుకున్నదానికి వ్యతిరేకంగా తయారయ్యే ప్రమాదం ఉంది. 

అబద్దాలు.. 
పిల్లలు తరచుగా అబద్దాలాడుతుంటారు. దీనికి కారణం నిజం చెప్పడం వల్ల తల్లిదండ్రులు తమను కొడతారనో, కోప్పడతారనో భయం. అలా పదే పదే అబద్దాలు చెబుతున్నారంటే మీరు వారి పెంపకంలో మరీ కఠినంగా ఉంటున్నారన్నట్టు.. అప్పుడు మారాల్సింది మీరే. 


పిల్లలకు నియమాలు పెట్టేముందు వారేం చెబుతున్నారో.. దానికి వారు ఎలా స్పందిస్తున్నారో ఓపెన్ మైండ్ తో వినండి.. వారితో కూర్చుని చక్కగా మాట్లాడితే సమస్య సగం సాల్వ్ అయిపోతుంది.

వారి అభిప్రాయాల్ని గౌరవించండి...
ముందుగా మీ పిల్లలు స్వంత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వండి. అది కరెక్టు కాదనుకున్నప్పుడు సరిచేయండి. మీరు చెప్పినట్టు మాత్రమే నడుచుకోవాలంటే బయటి ప్రపంచాన్ని ఎదుర్కోవడం వారికి కష్టమైపోతుంది. 

నియమాలు బ్రేక్ చేస్తే..
ఒకవేళ మీరు పెట్టిన రూల్స్ మీ పిల్లలు పాటించకపోతే వేరే శిక్షలు కాస్త తేలిగ్గా ఉండాలి. అంతేకానీ మూడునెలలపాటు మాట్లాడొద్దు.. బొమ్మలన్నీ పడేస్తాను.. లాంటి కఠిన శిక్షలు ఉండకూడదు.

మెచ్చుకుని చూడండి...
మీ పిల్లలు చేసే చిన్న పని అయినా సరే మెచ్చుకోండి. ఆ పనిలో వాళ్లు ఫెయిల్ అయినా సరే.. ప్రేమగా.. ‘పర్లేదు, చాలా బాగా చేశావ్.. ఇంకా బాగా చేద్దువు గానీలే’.. అంటూ చెప్పండి. నెక్ట్స్ టైం వారు చేసే అద్భుతాన్ని మీరే చూడొచ్చు.

ఎప్పుడూ పిల్లల్ని ఏదో ఒకటి తిడుతూ, సవరిస్తూ.. వారు చేసే ప్రతీ పనిలో తప్పులు వెతకడం మొదలుపెడుతున్నారంటే.. అది మీ సమస్య... మీ పిల్లలది కాదు. మారాల్సింది మీరు అని గుర్తుంచుకోండి. 
 

చిన్నపిల్లల సమస్యలు చిన్నవే.. కానీ వారికి అవి చాలా పెద్దగా అనిపిస్తాయి. వాటిని మీతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారంటే.. మీకు భయపడుతున్నారన్నట్టు.. ఇది భవిష్యత్తులో మీ ఇద్దరి అనుబంధం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మీ పిల్లలు మీతో ఫ్రెండ్ లా ఉండేలా చూసుకోండి. 

మీ పిల్లలకు పదే పదే రూల్స్ గుర్తు చేస్తూ, విమర్శిస్తూ ఉంటే తమ స్నేహితుల్ని ఇంటికి తీసుకురావడానికి ఇష్టపడరు. ఇంటి బయటే స్నేహితులతో కలవడానికి ఇష్టపడతారు. అది కూడా మీరు మరీ స్ట్రిక్ట్ గా ఉన్నారనడానికి నిదర్శనం..

పిల్లల రోజువారీ దినచర్యను పూర్తిగా ప్యాక్ చేయడం వల్ల వారికి కాసేపు హాయిగా ఊపిరి పీల్చుకునే సమయం ఉండదు. దీంతో వారు ఫ్రస్టేట్ అవుతారు. 

Latest Videos

click me!