Health Tips: టమాటాలో విటమిన్లు, ప్రోటీన్లతో పాటుగా ఇతర పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పరిగడుపున టమాటా జ్యూస్ ను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
మనం చేసే ప్రతి వంటలో ఖచ్చితంగా టమాటాలు ఉండాల్సిందే. టమాటాలు వంటకు రుచిని అందిస్తాయి. అంతేకాదు వీటిలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
27
అందుకే వీటిని రోజు వారి కూరల్లో వేసుకుని తింటుంటారు. అంతేకాదు వీటితో జ్యూస్ లు , సూప్ లు , చట్నీ వంటివి చేసుకుని తింటుంటారు. ఇంకొంతమందైతే వీటిని సలాడ్ గా చేసుకుని తాగుతూ ఉంటారు. అయితే ఈ టమాటాలను పరిగడుపున తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
37
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది: ఒక వ్యక్తికి రోగ నిరోధక శక్తి ఎంత అవసరమో.. కరోనా కష్టకాలంలో తెలిసొచ్చింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు, దాని నుంచి తొందరగా బయటపడేందుకు ఇమ్యూనిటీ పవర్ ఎంతో అవసరం. అందుకే జనాలంతా తమ జీవన శైలిని మార్చుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెరిగే ఆహారాలను తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో టమాట వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి ప్రతీ రోజు ఉదయం పూట పరిగడుపున గ్లాస్ టమాటా రసం తాగండి.
47
వెయిట్ లాస్: అధిక బరువు సమస్యతో బాధపడేవారు రెగ్యులర్ గా పరిగడుపున రెండు గ్లాసుల టమాటా జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగితే.. బరువు తగ్గుతారట. అంతేకాదు ఊబకాయం సమస్య నుంచి చాలా ఫాస్ట్ గా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.
57
tomato
టామాటాలను వట్టిగా తిన్నా.. అందులోని ఎన్నో పోషకాలు మనకు అందుతాయి. వీటిలో ఉండే ఫైటోకెమకల్స్, జింక్, పొటాషియం, ఫోలేట్, క్రోమియం, భాస్వరం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.
67
కడుపులో మంట: కడుపులో మంట సమస్యతో బాధపడేవారు రెగ్యులర్ గా మార్నింగ్ పూట పరిగడుపున ఒక గ్లాస్ టమాటో రసం తాగితే కడుపు మంట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పరిగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
77
కంటిచూపు: ప్రస్తుత కాలంలో కంటి చూపు సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ సమస్య తొలగిపోవాలంటే పచ్చి కూరగాయలను తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇందుకు టొమాటాలను ఎంచుకోండి. పరిగడుపున కొన్ని టమాటాలను జ్యూస్ గా చేసుకుని తాగండి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.