మీ భర్తకు ఈ విషయాలను ఎట్టి పరిస్థితిలో చెప్పకండి..

First Published | Mar 18, 2022, 3:38 PM IST

భర్యా భర్తలన్నాక అన్ని విషయాలను చెప్పుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పుకోవాలి కూడా. కానీ కొన్ని విషయాలను మాత్రం అస్సలు చెప్పకూడదు. ఆ విషయాల వల్ల మీ మధ్య గొడవలు, కొట్లాటలు జరగొచ్చు. అంతేకాదు ఈ విషయాలు మీరు విడిపోయే దాకా తీసుకెళ్లొచ్చు.. 

అతని కుటుంబాన్ని విమర్శించకూడదు:  ఎవ్వరైనా.. తమ కుటుంబం గురించి పొగడాలనుకుంటారే తప్ప విమర్శించాలని కోరుకోరు. ఒకవేళ తన కుటుంబాన్ని విమర్శిస్తే.. వాళ్లతో కొట్లాటలకు దిగుతారు. మీ భర్త దాకా ఎందుకు మీ కుటుంబాన్ని మీ భర్త తిడితే మీరు ఊరుకుంటారా..? కాబట్టి మీ భర్త కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీకు నచ్చకపోతే దాన్ని మీ భర్తకు చెప్పేయకండి. ఒకవేళ వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం వెంటనే చెప్పేయండి. కానీ ఊరికే నాకు ఆ వ్యక్తి నచ్చలేదు. వాళ్ల ప్రవర్తన బాలేదు. మీ కుటుంబం మంచిది కాదని నోటికి వచ్చినట్టుగా మాట్లాడకండి. దీనివల్ల మీ మధ్య గొడవలు రావొచ్చు. ఏ బంధమైనా కొన్ని సరిహద్దులు ఉంటాయి. అవెంతో ముఖ్యంగా కూడా..

గత లైంగిక జీవితం: మీ మాజీ లవర్ గురించి ఎట్టి పరిస్థితిలో చెప్పేయకండి. ఎందుకంటే ఎంతమంచి భర్తైనా.. తన భార్యకు పెళ్లికి ముందు లవర్  ఉన్నాడంటే అతను తట్టుకోలేడు. అంతేకాదు మీ మాజీ లవర్ తో లైంఘిక సంబంధం గురించి ఎట్టి పరిస్థితిలో చెప్పకండి. ఇలా చెప్తే మీ మధ్య దూరం విడిపోయేదాకా వెళ్లొచ్చు. ఇలా చెప్పడం వల్ల మీ పట్ల మీ భాగస్వామికి నమ్మకం ఉండదు. 
 


లోపాలు: ఇది మహా చెడ్డ అలవాటు. వీలైతే వారిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. వారి లోపాలను ఎత్తి చూపకూడదు. ప్రతి చిన్న విషయానికి మీ భర్తను విమర్శించకండి. దీనివల్ల వారెంతో బాధపడుతారు. మీతో ఏ విషయాలను షేర్ చేసుకోవాలనుకోరు కూడా. అతనిలో ఏది నచ్చదో.. దాన్ని సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. కానీ ఆ విషయాన్ని ఎత్తి చూపకండి. 
 

డబ్బు: ఆర్థిక విషయాల గురించి ఇద్దరూ చర్చించుకోవడం చాలా ముఖ్యం. డబ్బులను ఎలా సేవ్ చేయాలో ప్రణాళిక వేసుకోండి. కానీ అదే డబ్బు ల విషయం మీ మధ్య చిచ్చు పెట్టకుండా చూసుకోవాలి.  డబ్బులను సేవ్ చేయడం ముఖ్యమే కానీ.. ప్రతి దాన్ని డబ్బుతో ముడిపెట్టడం మాత్రం మంచిది కాదు. కాబట్టి డబ్బుల విషయంలో చాలా తక్కువగా మాట్లాడండి. 

ఇతరుల మాటలు వినకండి:  మీ భర్తకు మీ మధ్యసంబంధం ఎలా ఉందో మీకు తెలుసు. కానీ మీ స్నేహితులో లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీ మధ్య సంబంధం గురించి చర్చిస్తుంటారు. వాళ్ల ఒపీనియన్ చెప్తుంటారు. అంతేకాదు మీ భర్త మంచోడు కాదు.. బయట ఇలా ఉంటాడు అలా ఉంటాడని చాడీలు చెబుతుంటారు. అలాంటి వారిని మీరు మార్చలేరు. అలాగని ఈ విషయాలన్నింటినీ మీ భర్తకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు ఇతరులు మిమ్మల్ని ఎత్తిచూపితే.. వారికి మీ స్టైల్లో సమాధానం చెప్పండి. ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ వల్ల అందరూ సంతోషంగా ఉండాలంటే మాత్రం అది సాధ్యం కాదు. వారి మాటలు వింటే మీ భర్తకు మీకు మధ్య బంధం తెగిపోవచ్చు. మీ బంధాన్ని వాళ్లు ఏ రకంగా అర్థం చేసుకున్నా వీలైతే సమాధానం చెప్పండి. లేదంటే లైట్ తీసుకోండి.     

Latest Videos

click me!