Kids Health : పెద్దలకే కాదు పిల్లలకు కూడా యాలకులు మంచివే.. పిల్లలకు వీటిని తినిప్తే ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి.

First Published | May 9, 2022, 2:39 PM IST

Kids Health :  పిల్లలు యాలకులను తినడం వల్ల వారి కాలెయ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ వారి చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు విటమిన్ ఎ కళ్లలకు కూడా మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షిస్తుంది. 
 

Kids Health : పిల్లలు.. పెద్దల మాదిరిగా ఒకేసారి ఆహారాన్ని ఎక్కువగా తినలేరు. ఎందుకంటే వారి కడుపు చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వారు కొంచెం కొంచెంగా ఆహారాన్ని తరచుగా తింటారు. అలాంటప్పుడు పిల్లలకు ప్రతిసారీ ఒకేరకమైన ఆహారాలను ఇవ్వకూడదు. ఇలా ఇస్తే వారి  శరీరానికి పోషకాలు అందవు.

పిల్లలకు ఇచ్చే ఆహారంలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉండేట్టు చూసుకోవాలి.  డిఫరెంట్ ఫుడ్ ను అందించినప్పుడే వారి శరీరానికి భిన్నమైన పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు మసాలాలు తినిపించొచ్చా లేదా అన్న అనుమానాలు ఉంటాయి. ఒకవేళ తింటే ఏమవుతుందోనన్న సందేహంతో ఇవ్వరు. కానీ పిల్లలకు యాలకులు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


యాలకులు పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఎంతో మంచివి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జలుబు, జ్వరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలు యాలకులను తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 

పిల్లలకు యాలకులు ఎలా తినిపించాలి.. అనేక పద్దతుల్లో పిల్లలకు యాలకులను తినిపించొచ్చు. కానీ యాలకుల విత్తనాలు మెత్తగా, తడిగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే పొడి గింజలు పిల్లల గొంతులో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే వీటిని మొత్తగా నానబెట్టి ఇవ్వాలి. ఇందుకోసం వీటి గింజలను కొన్ని గంటలు లేదా ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే గింజలు మృదువుగా మారుతాయి. 

యాలకులు ఎలా తినాలి.. యాలకులను నీటిలో నానబెట్టిన తర్వాత కూడా తినడంలో ఇబ్బంది కలిగితే యాలకుల గింజల్ని గ్రైండ్ చేసుకుని మెత్తని పౌడర్ లా తయారుచేసుకోవాలి. ఈ పౌడర్ ను పాలలో కలిపి పిల్లలకు  ఇవ్వొచ్చు. ఈ పౌడర్ ను స్వీట్లు లేదా పెరుగులో కూడా కలుపుకుని తీసుకోవచ్చు. 

యాలకులు తినడం వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది.. 

కొవ్వు పెరగదు.. ఒక అధ్యయనం ప్రకారం.. యాలకుల పొడి ఊబకాయం లేదా ఒంట్లో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. అంతేకాదు ఇది డిస్లిపిడెమియా, ఆక్సీకరణ ఒత్తిడి, కాలెయం దెబ్బతినకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది. 
 

పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. యాలకులలో జీర్ణ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి పిల్లల జీర్ణ సామర్థాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడతాయి.  మీ పిల్లలకు కడుపునొప్పి లేదా మలబద్దకం సమస్య ఉంటే.. యాలకుల పౌడర్ ను ఆహారంలో కలిపి ఇవ్వండి. 

కాలెయ రక్షణ.. యాలకులు మీ పిల్లల కాలెయ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు ఇది కళ్లకు కూడా మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.  
 

Latest Videos

click me!