Single@30 : శృంగారానికి..కోరికకు తేడా తెలిసేది అప్పుడే..

First Published Sep 3, 2021, 3:57 PM IST

20ల్లో ఆకర్షణనే ప్రేమ అని భ్రమపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 30ల్లోకి వచ్చేసరికి ఏది నిజమైన ప్రేమ, ఏది ఆకర్షణ... ఏది కోరిక.. అనేది స్పష్టమైన అవగాహన ఉంటుంది. దీనివల్ల మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. 

ఇటీవలి కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అంత తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ముందు చదువు, కెరీర్ ఆ తరువాతే పెళ్లి అంటున్నారు. దీనివల్ల 30ల్లోకి వచ్చినా సింగిల్ గానే ఉండిపోతున్నారు. అయితే దీనివల్లా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే....

మెచ్యురిటీ వచ్చేస్తుంది. ముప్పైల్లోకి వచ్చేసరికి మీకు జీవితం మీద అవగాహన ఏర్పడుతుంది. విషయాల్ని అర్తం చేసుకోవడంలో మీకంటూ ప్రత్యేక ద్రుష్టి ఏర్పడుతుంది. మీరు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో బాగా కలుస్తారు, ఎవరు ఎలాంటి వారు అనే విషయాల్లో మీకు చక్కటి అవగాహన ఏర్పడుతుంది. అయితే  ఇది కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ వర్తిస్తుంది.  

ఇరవైళ్లో ఉన్నప్పుడు రిలేషన్ షిప్ లోకి దిగితే.. దానికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. మీ చుట్టూ ఉన్నవాటిని మరిచిపోతారు. కుటుంబాన్ని, స్నేహితుల్ని కూడా దూరం చేసుకుంటారు. అయితే 30ల్లోకి వచ్చేసరికి ఈ సమస్య ఉండదు. కారణం అప్పటికే మీకు కావాల్సినంత మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి.. ఏది ముఖ్యం, ఏది కాదు అనేదానిమీద ఎక్కువ ఫోకస్ పెడతారు. 

20ల్లో ఆకర్షణనే ప్రేమ అని భ్రమపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 30ల్లోకి వచ్చేసరికి ఏది నిజమైన ప్రేమ, ఏది ఆకర్షణ... ఏది కోరిక.. అనేది స్పష్టమైన అవగాహన ఉంటుంది. దీనివల్ల మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. 

విషయాల మీద సీరియస్ నెస్ వస్తుంది. ఇక 20ల్లో రిలేషన్ షిప్ లోకి వెడితే.. ఎక్కువ సమయం మీ భాగస్వామితో గడపాలని కోరుకుంటారు. దీంతో ఇద్దరికీ స్పేస్ ఉండకుండా పోతుంది. అలా కాకుండా 30ల్లోకి వచ్చాక రిలేషన్ షిప్ లోకి వెడితే.. ఎవరి స్పేస్ ఎంతో సరైన అవగాహన ఉంటుంది. రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగుతుంది.

20ల్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అంత తొందరగా అర్తం కావు. దీనివల్ల రిలేషన్ షిప్ లో ఏర్పడే తేడాలు వెంటనే గ్రహించలేరు. లేకపోతే తెలీకుండా తప్పులు చేసేస్తుంటారు. అదే 30ల్లో ఆ అవకాశం ఉండదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. ఆ సమయాన్ని మీకు మీరుగా కేటాయించుకుంటారు. 

20ల్లో జంటలుగా  ఏర్పడితే.. ఒకరితోఒకరు సమయం గడపడానికే సరిపోతుంది.  ఒంటరిగా కొత్త వ్యక్తుల్ని కలిసే సమయం ఉండదు. అదే 30ల్లో ఒంటరిగా ఉంటే.. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త ప్రపంచాన్ని  ఎక్స్ ప్లోర్ చేయచ్చు.  అంతేనా 30ల్లో  ఒంటరిగా ఉండడం వల్ల మీకిష్టమైన ప్రదేశాలు ఎంచక్కా చుట్టిరావచ్చు. 

వాళ్లేం అనుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో.. అనేది పెద్దగా పట్టించుకోరు. వాళ్లేం అనుకున్నారనేది మీకు అప్రస్తుతం.  ఇక ఈ వయసులో డేటింగ్ లో పడితే చాలా నిజాయితీగా ఉంటారు. డేటింగ్ లో పడేముందు అడిగే ప్రశ్నలకు ఓ   అర్దం ఉంటుంది. నిజాయితీ ఉంటుంది. 

మీ శరీరం గురించి మీకు చక్కటి అవగాహన ఏర్పడుతుంది. మీ సెక్సువాలిటీ విషయంలోనూ ఓ అంచనా వస్తుంది. మీకేం కావాలి.. మీరెలా ఉండాలి అనేది నిర్ణయించుకోగలుగుతారు. 

click me!