వేపాకులు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Jan 8, 2025, 1:09 PM IST

పెద్దలు చిన్న పిల్లలకు వేపాకు నీళ్లతో బాగా స్నానం చేయిస్తుంటారు. ఒక్క చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ నీళ్లతో స్నానం చేయొచ్చు. రోజూ వేపాకు నీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

వేపాకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే నేటికీ ఆయుర్వేదంలో ఈ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా మంది వేపాకులతో కాచిన నీళ్లతో చిన్న పిల్లలకు, బాలింతలకు స్నానం చేయిస్తుంటారు. ఎందుకంటే వేపాకు సారం ఎన్నో జబ్బులకు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. వీళ్లు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ వేపాకులు వేసి కాచిన నీటితో స్నానం చేయొచ్చు. ఈ నీళ్లతో రోజూ స్నానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

వేపాకు నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సంక్రమణ నుంచి బయటపడతారు 

వేపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన చర్మానికి అంటుకుని ఉన్న మలినాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి మన చర్మాన్ని కాపాడుతాయి. మీకు తెలుసా? స్నానం చేసే నీళ్లలో వేపాకులను వేసుకుని స్నానం చేస్తే  ముఖంపై మొటిమలు కావు. అలాగే ఇతర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. 


చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది

నీళ్లలో వేపాకులు వేసి కాసేపు మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం పొడిబారే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. వేపాకులు మన చర్మంలో సహజ నూనె సమతుల్యతను కాపాడుతుంది. 

శరీర దుర్వాసనను తగ్గిస్తుంది

శరీర దుర్వాసనకు ఎన్నో కారణాలు ఉన్నాయి.  వీటిలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం, చర్మానికి మురికి ఎక్కువగా ఉండటం కూడా ఉన్నాయి. ఈ రెండు కారణాల వల్ల కూడా  వాసన వస్తుంది. అయితే వేపాకులతో స్నానం శరీర దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. బాడీ దుర్వాసనను తగ్గించుకోవాలంటే మాత్రం మీరు స్నానం చేసే నీళ్లలో వేప ఆకులను కలపండి. ఇది వాసనను కలిగించే బ్యాక్టీరియాను వదిలిస్తుంది. 

కంటి అలెర్జీ నుంచి ఉపశమనం

వేప ఆకులు వేసిన నీళ్లతో స్నానం చేస్తే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వాటర్ కాలానుగుణంగా వచ్చే కంటి అలెర్జీల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. కలుషితం మన కళ్లకు, చర్మానికి చికాకు కలిగిస్తుంది. ఇవి తగ్గాలంటే మీరు చేయాల్సిందల్లా వేపాకులు వేసిన నీళ్లతో స్నానం చేయడమే. 

మొటిమలను తగ్గిస్తుంది

మొటిమల సమస్యను తగ్గించుకోవడానికి వేపాకులు బాగా ఉపయోగపడతాయి. ఈ సమస్య ఉన్నవారు వేపాకులను నీళ్లలో మరిగించి వాటితో స్నానం చేస్తే సరిపోతుంది. దీనివల్ల మొటిమలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Image: Getty Images

చర్మ అలర్జీల నుంచి ఉపశమనం

వేపాకు మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని ఉపయోగించి చర్మ అలెర్జీలు, దద్దుర్లు లేదా దురద వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి తగ్గాలంటే మీరు వేపాకులను నీళ్లలో కలిపి స్నానం చేయండి. దీనివల్ల ఇవి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

చుండ్రు లేకుండా చేస్తుంది

వేపాకులను నీళ్లలో కలిపి తలస్నానం చేయడం వల్ల తామర, చుండ్రు, వాపు వంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇది  స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వేపాకుల నీటితో తలస్నానం చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు తగ్గిపోయి ఒత్తుగా పెరుగుతుంది. 

సూచన

మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు గనుక ఉంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఈ చిట్కాను పాటించాలి. 

Latest Videos

click me!