ఒత్తైన జుట్టు కోసం దాల్చిన చెక్క.. దీన్ని ఎలా పెట్టాలంటే..?

First Published May 28, 2023, 4:26 PM IST

జుట్టు ఒత్తుగా పెరిగేందుకు కొన్ని సహజ పదార్థాలు ఎంతో సహాయపడతాయి. ఇలాంటి వాటిలో దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్కను కొన్ని పద్దతుల్లో జుట్టుకు పెడితే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
 

అందమైన, పొడవాటి, ఒత్తైన జుట్టును ఎవరు కోరుకోరు చెప్పండి? మీ జుట్టును పొడుగ్గా, మందంగా ఈ ప్రొడక్ట్స్ పెంచుతాయని టీవీల్లో యాడ్స్ రావడం చూసే ఉంటారు. వీటిని వాడి ఎలాంటి ఫలితం రాని వారు మనలో చాలా మందే ఉన్నారు. నిజానికి ఇలాంటి వాటిలో కెమికల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి. అందుకే సహజ పదార్థాలను వాడటమే మంచిది. మీ జుట్టుకు అద్భుతంగా పనిచేసే పదార్ధాలలో దాల్చినచెక్క ఒకటి. నిజానికి దాల్చినచెక్క ఒత్తైన జుట్టును పొందడానికి మీకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

cinnamon

మసాలా దినుసుగా ఉపయోగించే దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఈ సుగంధ, రుచికరమైన మసాలా దినుసు వంటకాలకు ప్రత్యేకమైన రుచిని జోడిస్తుంది. అంతేకాదు దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మీ జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. దాల్చినచెక్కను పురాతన కాలం నుంచి ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. 

మందపాటి జుట్టు కోసం దాల్చిన చెక్క

దాల్చినచెక్క యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్న బహుముఖ మసాలా దినుసు. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్లు, మంటను  తగ్గించడానికే కాదు జుట్టు సమస్యలను పోగొట్టడానికి కూడా దాల్చినచెక్క మంచిదని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలోని ప్రోసైనిడిన్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. అలాగే మీ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దాల్చినచెక్క జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి, బట్టతలను నివారించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

hair care

దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, పాలీఫెనాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అలాగే ఇవి మీ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. 

hair care

కార్గర్ ఇంటర్నేషనల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. దాల్చిన చెక్కలోని ప్రోసైనిడిన్ జుట్టు పెరుగుదలపై సానుకూల ప్రభావాలను చూపుతుందని కనుగొన్నారు. హెయిర్ ఆయిల్లో దాల్చినచెక్కను ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే లక్షణాలు నెత్తిమీద రక్తప్రసరణను పెంచి మీ జుట్టు అందంగా మెరవడానికి సహాయపడుతుంది. ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మీ నెత్తిమీద, జుట్టును ఫ్రీ రాడికల్ నష్టం, మంట నుంచి రక్షించడానికి, చుండ్రును పోగొట్టడానికి సహాయపడుతుంది.

ఒత్తైన జుట్టు కోసం దాల్చినచెక్కను ఎలా ఉపయోగించాలి?

జుట్టు పెరిగేందుకు, ఒత్తుగా అయ్యేందుకు దాల్చినచెక్కను రెండు పద్దతుల్లో ఉపయోగించొచ్చు. 

1. ఈ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల తాజా దాల్చిన చెక్క పౌడర్ ను తీసుకుని అందులో ఒక చెంచా తేనె, కొద్దిగా కొబ్బరినూనె ను పోసి కలపండి. దీన్ని చిక్కటి పేస్ట్ లా చేయండి. మాస్క్ ను వెంట్రుకలకు మొత్తం  పెట్టి బాగా మసాజ్ చేయండి. ఈ మాస్క్ 20 నిమిషాలు ఉంచండి. ఇది మీ జుట్టు ఫాస్ట్ గా పెరిగేందుకు సహాయపడుతుంది. 

2. గుడ్డు, కొబ్బరి నూనె, దాల్చిన చెక్క పౌడర్ ను తీసుకుని వీటన్నింటినీ కలిపి చిక్కటి పేస్ట్ గా తయారు చేసుకోండడి. దీన్ని మీ తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. 

click me!