మీకిది తెలుసా.. కూరగాయలతో కూడా పొట్ట కరుగుతుంది..

Published : Feb 27, 2022, 03:35 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. ఈ పొట్ట వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. బాన పొట్ట వల్ల హై బీపీ, డయాబెటీస్ వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. 

PREV
17
మీకిది తెలుసా.. కూరగాయలతో కూడా పొట్ట కరుగుతుంది..
belly fat

చాలా మంది పొట్ట ను తగ్గించుకోవడానికి ఎన్నోఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది రెగ్యులర్ గా డైటింగ్ చేస్తుంటారు. అయినా పొట్ట తగ్గదు. మరికొంతమందైతే పొట్టను కరిగించడానికి బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. పొట్ట తగ్గాలని మీరు నెల రోజుల పాటూ మజ్జిక పండ్లు తీసుకున్నా మీ పొట్ట ఇంచుకూడా కరగదు. ఈ పొట్టను కరిగించడానికి రెండు పద్దతులు బాగా ఉపయోగపడతాయి. 

27

రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తుండాలి. పోషకాహారం తీసుకోవాలి. అయితే కొన్ని రకాల కూరగాయలు కూడా మీ పొట్టను కరిగించడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
 

37

గుమ్మడికాయ: కొవ్వును కరిగించడంలో గుమ్మడికాయ ఎంతో సహాపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుమ్మడి కాయను కూరగా చేసుకుని తినండి. లేదంటే బూడిద గుమ్మడికాయను జ్యూస్ గా చేసుకుని తాగండి. దీనివల్ల ఎలాంటి బాన పొట్ట అయినా సరే ఇట్టే కరిగిపోతుంది. 

47
green-chillies

మిరపకాయలు: పచ్చి మిరపకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మిరపకాయతోనే బెల్లీ ఫ్యాట్ ను కరిగించొచ్చు అంటున్నారు నిపుణులు. ఈ మిరపకాయలను విరివిగా కూరల్లో వాడుతూ తీసుకుంటే కొవ్వు కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

57

కాలీఫ్లవర్, క్యాబేజీ: పీచు పదార్థాలు కొవ్వును కరిగించడానికి సహాయపడతాయట. కాబట్టి మీరు మీ రోజు వారి ఆహారంలో క్యాబేజీలను, కాలీఫ్లవర్ ను చేర్చుకోండి. వీటిని తీసుకుంటే మీ పొట్ట కరిగిపోతుంది. 

67

పుట్టగొడుగులు: పుట్టగొడుగులు కూడా పొట్టకున్న కొవ్వును కరిగిస్తాయని నిపుణులు అంటున్నారు. వారానికి రెండు మూడు సార్లు వీటిని తీసుకుంటే పొట్ట ఇట్టే  కరిగిపోతుంది. ఈ పుట్టగొడుగుల్లో ఉండే ప్రోటీన్లు మనలోపల మెటబాలిజంను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా కొవ్వు ఈజీగా కరుగుతుంది. 
 

77

ఆకుకూరలు: ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వులన్నీ కరిగిపోతాయట. 
 

click me!

Recommended Stories