మడమల పగుళ్లకు కారణాలు?
అసలు మడమలు ఎందుకు పగుళుతున్నాయో తెలుసుకుంటే వీటిని నయం చేసుకోవడం చాలా సులువు. మడమల పగుళ్లకు అత్యంత సాధారణ కారణాలలో డ్రై స్కిన్ ఒకటి. అవును తేమ లేకపోవడం లేదా కఠినమైన సబ్బులను, డిటర్జెంట్లకు గురికావడం వల్ల మడమలు పగులుతాయి. అలాగే శరీరంలో తగినంత నీరు లేకపోవడం, ఎప్పుడూ షూస్ ను వేసుకోవడం, లేదా చెప్పులు వేసుకోవడం, ఎక్కువసేపు నిలబడటం, మీ పాదాల నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించకపోవడం వంటివి మడమల పగుళ్లకు కారణమవుతాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, సోరియాసిస్, థైరాయిడ్ లేదా మూత్రపిండాల వ్యాధులు, డయాబెటిస్, పోషక లోపాల వల్ల కూడా మడమలు పగులుతాయి.