Beauty Tips: కొబ్బరి నూనెను ఇలా పెట్టారంటే మీ జుట్టు అస్సలు ఊడనే ఊడదు

First Published | Nov 16, 2023, 3:18 PM IST

Beauty Tips: కొబ్బరి నూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన చర్మానికే కాదు జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తలకు మసాజ్ చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే..
 

Beauty Tips: కొబ్బరి నూనె మన జుట్టుకు, చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొబ్బరి నూనెతో చర్మానికి మసాజ్ చేయడం వల్ల మచ్చలు తగ్గిపోతాయి. ఇక దీన్ని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మృదువుగా ఉంటుంది. చాలా మంది కొబ్బరి నూనెను కేవలం జుట్టుకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇది మంచిదే కానీ.. దీన్ని వల్ల జుట్టు ప్రయోజనాలను పొందాలంటే మాత్రం కొబ్బరి నూనెను పెట్టడానికి కొన్ని పద్దతులను ఫాలో కావాల్సిందేనంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Image: Getty

స్టెప్ 1

ముందుగా మీరు సరైన కొబ్బరి నూనెను మాత్రమే కొనాలి. శుద్ధి చేయని, సేంద్రీయ  కొబ్బరి నూనెను మాత్రమే కొనండి. ఎందుకంటే ఇలాంటి కొబ్బరి నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

స్టెప్ 2

జుట్టుకు నూనె పెట్టడానికంటే ముందు మీ జుట్టు రకం, అది ఎలా ఉందో తెలుసుకోండి. అంటే మీ జుట్టు కర్లీగా ఉంటుందా, నిటారుగా లేదా డ్రైగా ఉంటుందనేది తెలుసుకోండి.  పొడిగా, దెబ్బతిన్న జుట్టుకు కొబ్బరి నూనె చాలా చాలా అవసరం. పొడి, దెబ్బతిన్న జుట్టుకు కొబ్బరి నూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే సాధారణ లేదా జిడ్డుగల జుట్టు కూడా ఈ నూనెతో కొన్ని ప్రయోజాలను పొందుతుంది. 
 

Latest Videos


Image: Getty

స్టెప్ 3

కొబ్బరి నూనె పెట్టాలంటే మీ జుట్టు శుభ్రంగా, పొడిగా ఉండాలి. కొబ్బరి నూనె పెట్టడానికి ముందు మీ జుట్టు చిక్కులు లేకుండా చూసుకోవాలి. చిక్కులు ఉంటే మందపాటి దంతాల దువ్వెనతో చిక్కులు తీయండి. 
 

Image: Getty

స్టెప్ 4

కొబ్బరి నూనెను జుట్టుకు అప్లై చేయడానికి ముందు కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయండి. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనె బాటిల్ ఉంచి గోరువెచ్చగా అయ్యే వరకు అందులో ఉంచొచ్చు. 

స్టెప్ 5

ఇప్పుడు ఈ గోరు వెచ్చని కొబ్బరినూనెను జుట్టుకు పట్టించే ముందు వేళ్లకు కొబ్బరినూనె అంటించుకుని జుట్టు మూలాలకు అప్లై చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇప్పుడు జుట్టు అడుగు భాగానికి నూనె రాయండి. 
 

Image: Getty

స్టెప్ 6

జుట్టును నూనెను పెట్టిన తర్వాత కనీసం 5 నిమిషాలు పాటైనా మసాజ్ చేయండి. ఎందుకంటే ఇది మీ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే జుట్టును బలోపేతం చేస్తుంది. దీంతో జుట్టు రాలే అవకాశం తగ్గుతుంది.

Image: Getty

స్టెప్ 7

జుట్టును మసాజ్ చేసిన తర్వాత పెద్ద పెద్ద దంతాల దువ్వెనతో లేదా మీ వేళ్ల సహాయంతో జుట్టంతా నూనెను పెట్టండి. అంటే మొత్తం నూనె అంటుకునేలా చూసుకోండి. జుట్టు డీప్ కండిషనింగ్ కావాలనుకుంటే రాత్రంతా నూనెను అలాగే ఉంచి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయండి.
 

click me!