సెక్స్ లో ఎంతసేపు పాల్గొంటే మంచిది?

First Published | Nov 16, 2023, 1:53 PM IST

శృంగారంతో బోలెడు మానసిక, శారీరక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే సెక్స్ లో ఎంతసేపు పాల్గొంటే మంచిది అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? 
 

Image: Getty Images

సెక్స్ తో ఆడవారికి మగవారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వారానికి రెండు మూడు సార్లైనా సెక్స్ లో పాల్గొన్న వారికి గుండె జబ్బులతో పాటుగా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అయితే శృంగారంతో ఎంత సేపు పాల్గొంటే మంచిదన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఇప్పటికీ శృంగారం ఎంతకాలం ఉండాలనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. తక్కువ సెక్స్ సెషన్ అంత ప్రభావవంతంగా లేదా ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. 

Image: Getty Images

సాధారణంగా సెక్స్ లో పాల్గొన్న 5-10 నిమిషాల తర్వాత పురుషులు స్ఖలనం చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం.. సెక్స్ ను తగినంత, వాంఛనీయమైన, చాలా చిన్నది, ఎక్కువ కాలం ప్రాతిపదికగా విభజిస్తుంది. 3 నుంచి 13 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొనడం సాధారణమేనని ఈ అధ్యయనం పేర్కొంది. మూడు నుంచి ఏడు నిమిషాల మధ్య సాగే శృంగారం సరిపోతుందని అధ్యయనం వెల్లడిస్తోంది. అలాగే ఏడు నుంచి పదమూడు నిమిషాల మధ్య సాగే శృంగారం వాంఛనీయమని ట్యాగ్ చేశారు.
 


Image: Getty Images

మంచి సెక్స్ అంటే? 

శృంగారం ఎంత సేపు ఉండాలనే దానితో సంబంధం లేకుండా మంచి సెక్స్ ను ఆస్వాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు. మంచి సెక్స్ లో పాల్గొనడానికి భాగస్వాములిద్దరూ దీని గురించి మాట్లాడుకోవాలి. అలాగే సమయం ఇవ్వాలి. అంటే అవతలి వ్యక్తికి ఏది మంచి అనుభూతిని కలిగిస్తుందో ఒకరికొకరు తెలియజేసుకోవాలి. విషయాలను చర్చించుకోవాలి. మీరు మీ ఫాంటసీలను కూడా షేర్ చేసుకోవచ్చు. 
 

లైంగిక అనుభవం అంటే కేవలం శృంగారంలో పాల్గొనడం మాత్రమే కాదు. సెక్స్ తర్వాత కౌగిలింతలు ఎంత ముఖ్యమో ఫోర్ ప్లే కూడా అంతే ముఖ్యం. కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో ఆనందం కూడా అంతే ముఖ్యం. సెక్స్ సమయంలో కూడా మీ భావోద్వేగాలను వ్యక్తపరచడం చాలా సహాయపడుతుంది. 

Marrige sex

సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఇలా చేయండి

ఫోర్ ప్లే 

ఫోర్ ప్లే మీలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇది సెక్స్ కు ముందు జరిగే లైంగిక చర్య. ఇది మీ భాగస్వామితో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది మీ భాగస్వామిలో లైంగిక కోరికలను కలిగించడానికి కూడా సహాయపడుతుంది. 
 

నెమ్మదిగా సాగడం

రతిక్రీడ కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా నెమ్మదిగా సాగించొచ్చు. ఇది భావప్రాప్తి అవకాశాలను పెంచుతుంది. అలాగే మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనొచ్చు. 

స్టామినాను పెంచండి

శృంగారం ఎక్కువ సేపు ఉండాలంటే అందుకు కావాల్సిన ఎనర్జీ మీకు ఉండాలి. మీ స్టామినా పెరిగిన తర్వాత ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనొచ్చు. ఇందుకోసం ఒక గొప్ప మార్గం ఎక్కువ వ్యాయామాలు చేయడం. కటి వ్యాయామాలు ఇందుకు బాగా సహాయపడతాయి. 
 

మీ భాగస్వామితో చర్చించండి

మీకు ఏం కావాలో మీ భాగస్వామికి చెప్పండి. ఇది మీరు సెక్స్ లో ఎక్కువసేపు ఉండటానికి మాత్రమే కాదు నాణ్యతను పెంచడానికి కూడా మంచిమార్గం. వేర్వేరు భంగిమలను ప్రయత్నించడం, రోల్ ప్లే సెక్స్ ను మరింత ఆస్వాదించడానికి ఉపయోగపడుతుంది. 
 

సెక్స్ ఎక్కువసేపు ఉంటే ఏమవుతుంది?

ఎంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే అంత మంచిదని అనిపించినా అది నిజం కాకపోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొంటే యోని సంక్రమణ సమస్య వస్తుంది. అలాగే యోని నొప్పి, వాపునకు కూడా దారితీస్తుంది. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొంటే కందెన ఎండిపోయి ఘర్షణ కలుగుతుంది. ఇది నొప్పికి దారితీస్తుంది. అలాగే యూటీఐలకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడం వల్ల శారీరకంగా కూడా అలసిపోతారు.

Latest Videos

click me!