క్రికెటర్ అవ్వాలి అంటే శారీరక దృఢత్వం చాలా ముఖ్యం. ఫిట్నెస్ విషయంలో చాలా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో కోహ్లీ మరింత ఎక్కువగా పర్టిక్యూలర్ గా ఉంటారు. కోహ్లీ ఇప్పుడు కాదు, తాను అండర్ -15 ఆడే సమయం నుంచే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడట. దాని కారణంగానే 20 సంవత్సరాల తన కెరీర్ లో గాయాలపాలైన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఇక, తరచూ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. కార్డియో, స్ట్రెచ్‌లు, కోర్ కండరాలు, బరువులు, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ వర్కవుట్ లు చేస్తూ ఉంటారు. ఇక, చాలా బ్యాలెన్స్డ్ ఆహారం, ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకుంటారు.