కలబందను పెదవులకు కూడా పెట్టొచ్చా?

చలికాలంలో పెదవులు తరచుగా పగుతుంటాయి. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు ఈ పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. అయితే ఈ పగుళ్లను నయం చేయడానికి కలబంద కూడా సహాయపడుతుందని కొంతమంది అంటుంటారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చలికాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఈ సీజన్ మనల్ని ఎన్నో అనారోగ్ సమస్యల బారిన పడేస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో పెదవులు పొడిబారి పగిలిపోతుంటాయి. కొన్ని కొన్ని సార్లైతే వాటిలోంచి రక్తం కూడా వస్తుంటుంది. పెదవులు పగలడానికి నీళ్లను తక్కువగా తాగడం నుంచి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక పెదాల పగుళ్లను నయం చేయడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయితే పెదవుల పగుళ్లను  తగ్గించడానికి కలబంద కూడా సహాయపడుతుందని చాలా మంది అంటుంటారు. దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కలబందలోని ఔషదగుణాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎన్నో ఔషధ ప్రయోజనాలను అందించే పురాతన మొక్కల్లో ఒకటి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడానికి, అలెర్జీల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. పొడిబారడం, పగిలిన పెదవులను కూడా ఇది నయం చేయగలదు. అయితే కలబంద మాయిశ్చరైజర్ అంత గొప్పది కాదు. కలబందను మాత్రమే కాకుండా దీన్ని హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ తో కలిపి తీసుకోవడం ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పగిలిన పెదవులకు కలబందను ఉపయోగించాలనుకుంటే కొబ్బరి నూనె, మినరల్ ఆయిల్ వంటి వాటిని బేస్ గా ఉపయోగించొచ్చు.
 


aloe vera gel

కొన్ని సార్లు కలబంద చర్మాన్ని చికాకుపెడుతుంది. లేదా సున్నితమైన వ్యక్తులలో తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలకు కూడా కారణమవుతుంది. కలబంద పడకుంటే చర్మం ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఎర్రగా మారడం
దురద
పెదవుల వాపు
పెదవుల చుట్టూ చర్మం ఉబ్బడం

ఇది కొంతమందికి కలబంద ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించనప్పటికీ.. ఇది పగిలిన పెదవులను నయం చేసుకోవడానికి కలబందను క్రమం తప్పకుండా పెదవులకు పెట్టడం మంచిది కాదు. మీరు ఏదైనా పదార్ధాన్ని మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగం చేయడానికి ముందు ఎప్పుడూ కూడా మీ చర్మంపై ప్యాచ్ పరీక్ష చేయాలి.
 

పగిలిన పెదవులను తగ్గించడానికి ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి 

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో చర్మాన్ని తేమగా మార్చే, చర్మాన్ని నయం చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ డెర్మటాలజీ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం .. కొబ్బరి నూనె హానికరమైన పర్యావరణ కారకాల వల్ల కలిగే నష్టాన్ని సరిచేసే గుణాన్ని కలిగి ఉంటుందని కనుగొన్నారు. అందుకే పెదవులు పొడిబారినట్టుగా అనిపిస్తే కొద్దిగా కొబ్బరినూనెను రుద్దండి.
 

తేనె

సెంట్రల్ ఆసియా జర్నల్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కనుగొన్నట్టుగా  తేనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను నయం చేస్తాయి. తేనె తేలికపాటి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది. ఇది పొడి పెదవులను నయం చేస్తుంది. అలాగే చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇది పెదవుల ఆకృతిని కూడా మెరుగుపరుస్తుంది.
 

ఆవు నెయ్యి

ఆవు నెయ్యిలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి పొడి, పగిలిన పెదవులను పోషిస్తాయి. ఇది చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచడానికి, మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.
 

వెన్న

పగిలిన పెదవులకు వెన్న కూడా బాగా పనిచేస్తుంది. వెన్నలో మీ పెదవులను పోషించే అద్భుతమైన పోషణ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. 
 

Latest Videos

click me!