స్నానపు నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే కీళ్ల నొప్పులు, మొటిమలు తగ్గడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..

Published : Apr 23, 2022, 03:55 PM IST

Bathing with Salt Water Benefit: నీళ్లలో కాస్త ఉప్పును వేసి స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడమే కాదు ఇన్ఫెక్షన్ సమస్య కూడా దూరమవుతుంది. అలాగే ముఖంపై మొటిమలు కూడా వదిలిపోతాయి.   

PREV
16
స్నానపు నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే కీళ్ల నొప్పులు, మొటిమలు తగ్గడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..

Bathing with Salt Water Benefit: వాతావరణాన్ని బట్టి చల్లవి లేదా వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఈ రెండింటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వేడివి లేదా చల్లని నీళ్లలో కొంచెం ఉప్పును యాడ్ చేసి స్నానం చేయడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయన్న విషయం మీకు తెలుసా..? 

26

అవును ఉప్పును కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించడంతో పాటుగా ఒత్తిడి కూడా దూరమవుతుంది. మరి ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.

36

కీళ్ల నొప్పులు తగ్గుతాయి.. ఉప్పు కలిపిన నీళ్లు కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు స్నానం చేసేముందు నీళ్లలో చిటికెడు ఉప్పును కలిపి రాసుకుంటే కీళ్ల తగ్గిపోతాయి. ఇదీ కాకుండా పాదాలు నొప్పిగా ఉంటే కొన్ని గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఉప్పును వేసి మీ పాదాలను కడగితే మంచి ఫలితం ఉంటుంది. 

46

ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి.. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే.. వాటిని తొలగించడానికి ఉప్పు నీరు ఎంతో సహాయపడుతుంది. నిజానికి ఉప్పులో  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే ఎన్నో ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని రంధ్రాలు తెరచుకుంటాయి. దీంతో ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది. 

56

మెటిమలు వదిలిపోతాయి.. మొటిమలకు ఉప్పునీరు చక్కని మెడిసిన్ లా పనిచేస్తుంది. ఉప్పు నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే రంధ్రాలు తెరచుకుంటాయి. దీంతో శరీరంలో ఉండే మురికి అంతా బయటకు పోతుంది. తద్వారా ముఖంపై ఉండే మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు వదిలిపోతాయి. అంతేకాదు ఈ నీళ్లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా కూడా ఉంచుతుంది. 

66

ఒత్తిడి తగ్గుతుంది.. మీరు చేసే పనులకు సంబంధించి గానీ లేదా ఇతర విషయాల గురించి మీరు ఒత్తిడికి గురవుతున్నట్టై.. అలాంటి సమయంలో ఉప్పు నీళ్లతో స్నానం చేయండి. దీంతో మీ ఒత్తిడి తగ్గుతుంది. ఉప్పునీళ్లలో ఉండే ఖనిజాలు శరీరంలోకి శోషించుకోబడతాయి. సోడియం మెదడుపై కూడా ప్రభావం చూపెడుతుంది. అంతేకాదు దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ నీళ్లతో స్నానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా మారుతారు.  

click me!

Recommended Stories