ఈ ఒక్కటి పెట్టినా.. పచ్చని పళ్లు తెల్లగా అవుతాయి

First Published | Oct 29, 2024, 4:50 PM IST

చాలా మంది పళ్లను పది పదిహేను నిమిషాలైనా తోముతుంటారు. అయినా పళ్లపై ఉన్న మచ్చలు, పసుపు దనం అస్సలు పోదు. ఎంత తోమినా ఇలా పచ్చగానే ఉంటున్నాయని బాధపడుతుంటారు. కానీ అరటిపండుతో పచ్చని పళ్లను కాస్త తెల్లగా తలతలా మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే?

అరటి తొక్కతో దంతాలు తెల్లగా

మన ముఖంలో ముందుగా కనిపించేది నవ్వు. ఆ నవ్వు వెనకున్న పళ్లు. పళ్లు ఎంత తెల్లగా ఉంటే మన అందం అంత పెరిగిపోతుంది. ఇది కేవలం ముఖ సౌందర్యానికి మాత్రమే కాదు మన వ్యక్తిత్వానికి కూడా ముఖ్యమైనవి.

తెల్లగా ఉండే దంతాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కానీ కొంతమంది పళ్లు పసుపు పచ్చగా ఉంటాయి. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, దంతాలను సరిగ్గా తోమకపోవడం, స్మోకింగ్, వయసు మీద పడటం వంటి ఎన్నో కారణాల వల్ల దంతాలు ఇలా పసుపు పచ్చగా అవుతాయి. 

అరటి తొక్కతో దంతాలు తెల్లగా

పచ్చని దంతాలు ఉన్నవారు వాటిని తెల్లగా చేసేందుకు చాలా సేపటి వరకు తోముతుంటారు. టూత్ పేస్ట్ లను మారుస్తుంటారు. కానీ ఒక చిన్న పండుతో మీరు మీ పచ్చని పళ్లను తిరిగి తెల్లగా మెరిసేలా చేయొచ్చు. అవును అరటి తొక్కతో పచ్చని పళ్లను తెల్లగా చేయొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


అరటి తొక్కతో దంతాలు తెల్లగా

అరటి తొక్కతో దంతాలను తెల్లగా చేయడం ఎలా?

చాలా మంది అరటిపండును తినేసి దాని తొక్కను పనికిరాదని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ అరటి తొక్క కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అరటి తొక్కలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

ఇవి పళ్లను తెల్లగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అయితే ఒక్క అరటితొక్కను మాత్రమే కాకుండా.. దానితో ఏదైనా కలిపి పెడితే మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు. ఇందుకోసం అరటి తొక్కతో బేకింగ్ సోడాను ఉపయోగించొచ్చు.

అరటి తొక్కతో దంతాలు తెల్లగా

ఉపయోగించే విధానం:

పచ్చని పళ్లను తెల్లగా చేయడానికి ముందుగా.. అరటి తొక్కను తీసుకుని దాని లోపలి తెల్లని భాగాన్ని దంతాలకు రుద్దండి. తొక్కను పై నుంచి కిందకి వృత్తాకారంలో రుద్దితే దానిలో ఉండే పోషకాలు దంతాలకు బాగా అంటుకుంటాయి.

ఆ తర్వాత  ఒక చెంచా బేకింగ్ సోడాను తీసుకుని.. దానికి కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు అరటి తొక్కతో బేకింగ్ సోడా పేస్ట్ ను కలిపి దంతాలకు రాసుకోవాలి. దీన్ని దంతాలపై రెండు మూడు నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

అరటి తొక్కతో దంతాలు తెల్లగా

ఇది ఎలా పనిచేస్తుంది?

అరటి తొక్కలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది దంతాల ఉపరితలాన్ని చేరి పసుపు రంగును పోగొడుతుంది. అలాగే బేకింగ్ సోడా నేచురల్ స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది.

ఇది పళ్లపై పొరలోని మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు బేకింగ్ సోడాలోని ఆల్కలీన్ లక్షణాలు దంతాల పసుపు రంగును తగ్గించడానికి సహాయపడతాయి.

గుర్తుంచుకోండి:

ఈ చిట్కాలను ఫాలో అవ్వడమే కాకుండా.. దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి.

అలాగే టీ, కాఫీ, సిగరెట్లు ఎక్కువగా తాగడం మానుకోండి. ఎందుకంటే ఇవి మీ పళ్లను పసుపు రంగులోకి మారుస్తాయి. అలాగే దంతాలు తెల్లగా ఉండేందుకు కనీసం 6 నెలలకోసారైనా దంత వైద్యుడి దగ్గరకు వెళ్లండి. 

click me!