ఆయుర్వేదం ప్రకారం.. బొడ్డు శరీరానికి శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. అయితే బొడ్డుకు రోజూ నెయ్యిని రాయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో విటమిన్ -ఇ, విటమిన్ -ఎ, విటమిన్ -డి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. అసలు స్నానం చేయడానికి ముందు బొడ్డుకు నూనెను రాయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చర్మానికి పోషణ
స్నానం చేయడానికి ముందు బొడ్డుకు నెయ్యిని రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే? ఇది మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం పొడిబారడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎప్పుడే ప్రకాశవంతంగా ఉంటుంది.
మెరుగైన జీర్ణక్రియ
ఆయుర్వేదం ప్రకారం.. నాభిని జీర్ణక్రియ ప్రదేశంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ ప్రదేశంలో నెయ్యిని రాయడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
మలబద్ధకం
స్నానానికి ముందు బొడ్డుకు నెయ్యిని రాయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం నాభిలో 2-3 చుక్కల నెయ్యిని వేసి కొద్దిసేపు మసాజ్ చేయండి. నాభిలో నెయ్యి వేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దకంతో పాటుగా జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
కీళ్ల నొప్పి
కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. బొడ్డులో నెయ్యిని వేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం ముందుగా బొడ్డులో కొన్ని చుక్కల నెయ్యి వేసి నాభి చుట్టూ మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తొలగిపోతాయి. వాపు కూడా చాలా వరకు తగ్గుతుంది.
వాత దోషం సమతుల్యంగా ఉంటుంది
ఆయుర్వేదం ప్రకారం.. బొడ్డుకు నెయ్యిని పూయడం వల్ల వాత దోషం తగ్గిపోతుంది. వాతం అసమతుల్యత ఉన్నప్పుడు మీ జీర్ణవ్యవస్థలో ఆందోళన, చంచలత, రుగ్మతలు వస్తాయి. అయితే ఈ సమస్యను తగ్గించడానికి నెయ్యి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బొడ్డులో నెయ్యిని వేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు స్థిరంగా ఉంటుంది.