
వేసవిలో చెమట పట్టడం సర్వ సాధారణ విషయం. చెమట శరీరానికి అవసరం కూడా. ఎందుకంటే ఇది శరీరం నుంచి మురికిని తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. అయితే కొంతమందికి మాత్రం చెమట మరీ ఎక్కువగా పడుతుంది. శరీరం నుంచి చెమటను బయటకు పంపే గ్రంథులు గంటల తరబడి అతి చురుకైనవిగా మారినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం మీ శరీరంలో పిత్త లోపం వల్లే ఇలా జరుగుతుంది.
కొన్ని ఆయుర్వేద చిట్కాలతో అధిక చెమట, దుర్వాసన వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
కొంతమందికి ఎందుకు ఎక్కువ చెమట పడుతుంది: చెమట ఎక్కువగా పట్టడానికి రెండు కారణాలు ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
మొదటి కారణం - ఏ వ్యాధి లేకుండా ఎక్కువగా చెమట పట్టినట్లైతే Esophageal gland దానికి కారణంగా చెప్పొచ్చు. ఈ గ్రంథి చురుకుగా మారినప్పుడు.. శరీరం సాధారణం కంటే ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభిస్తుంది.
రెండవ కారణం- ఎక్కువ చెమట పట్టడానికి మరొక కారణం ఉంది. అంటే థైరాయిడ్ గ్రంథి రుగ్మత (Thyroid gland disorder), మధుమేహం (Diabetes), పీరియడ్స్ (Periods), జ్వరం (Fever), ఆందోళన (Anxiety), గుండె సంబంధిత వ్యాధులు ఉంటే కూడా విపరీతంగా చెమట పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి సమస్యలున్న వారికి కొన్ని ఆయుర్వేద పానీయాలు బాగా ఉపయోగడపతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే
ధనియాల నీళ్లు - కొత్తిమీర గింజలను గ్రైండ్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం వీటిని పరిగడుపున తీసుకోవాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
నార్మల్ వాటర్ తాగడానికి బదులుగా రోజంతా Khus (Root) వాటర్ ను తాగాలి. దీని కోసం ఒక టీస్పూన్ Khus రూట్ ను 2 లీటర్ల నీటిలో 20 నిమిషాలు నానబెట్టండి. దీని తరువాత దానిని వడకట్టి దానిని తీసుకోండి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.
ఈ పేస్ట్ ను శరీరానికి అప్లై చేయాలి- తెల్ల చందనాన్ని పేస్ట్ లా చేసి చెమట పట్టే ప్రదేశంలో బాగా అప్లై చేయాలి. 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చెమటను తగ్గిస్తుంది.
ఒకవేళ మీరు విపరీతంగా చెమట పడుతున్నట్లయితే.. మసాలా ఆహారాలను, పుల్లని ఆహారాలను తగ్గించండి. లేదా అస్సలు తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే మీ ఎక్కువ వేడిగా ఉండే భోజనాన్ని తినకండి. ప్రతిరోజూ నానబెట్టిన 10 ఎండుద్రాక్షలను ఖాళీ కడుపుతో తినండి. ఆహారంలో కారం, తీపి ఆహారాలను ఎక్కువగా తినకండి.
వైద్య శాస్త్రం ఏమి చెబుతుంది?
హైపర్ హైడ్రోసిస్ (Hyperhidrosis)అనేది ఒక సాధారణ పరిస్థితి. దీనివల్ల విపరీతంగా చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరం విపరీతంగా చెమట పడుతుంది. చెమట మొత్తం సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జనాభాలో సుమారు 3% మంది హైపర్ హైడ్రోసిస్ తో బాధపడుతున్నారు. అధికంగా చెమట పట్టడంలేదా హైపర్ హైడ్రోసిస్ అనేది థైరాయిడ్ సమస్యలు, మధుమేహం లేదా సంక్రామ్యతల హెచ్చరిక సంకేతం.