indian marriage
Marriage Dates in 2024: జనవరి 2024 లో పెళ్లి చేసుకోవడానికి శుభమూర్తం
జనవరిలో పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏయే తేదీల్లో అంటే: జనవరి 16 (మంగళవారం), జనవరి 17 (బుధవారం), జనవరి 20 (శనివారం), జనవరి 21 (ఆదివారం), జనవరి 22 (సోమవారం), జనవరి 27 (శనివారం), జనవరి 28 (ఆదివారం), జనవరి 30 (మంగళవారం), జనవరి 31 (బుధవారం)
marriage
ఫిబ్రవరి 2024 లో శుభ వివాహం తేదీలు
2024 ఫిబ్రవరిలో వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో కూడా ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మరి ఈ నెలలో పెళ్లిళ్లు చేయడానికి మంచి ముహూర్తాలు ఏయే తేదీన వస్తున్నాయంటే: ఫిబ్రవరి 4 (ఆదివారం), ఫిబ్రవరి 6 (మంగళవారం), ఫిబ్రవరి 7 (బుధవారం), ఫిబ్రవరి 8 (గురువారం), ఫిబ్రవరి 12 (సోమవారం), ఫిబ్రవరి 13 (మంగళవారం), ఫిబ్రవరి 17 (శనివారం), ఫిబ్రవరి 24 (శనివారం), ఫిబ్రవరి 25 (ఆదివారం), ఫిబ్రవరి 26 (సోమవారం), ఫిబ్రవరి 29 (గురువారం)
Marriage
2024 మార్చి లో శుభ వివాహం తేదీలు
ఇండియాలో మార్చి నెల చివరలో ఎండాకాలం షురూ అవుతుంది. అందుకే ఈ నెలలో ఎంచక్కా పెళ్లిపీఠలు ఎక్కొచ్చు. మరి ఈ నెలలో ఏయే తేదీన పెళ్లిళ్లు జరగనున్నాయంటే? మార్చి 1 (శుక్రవారం), మార్చి 2, (శనివారం), మార్చి 3 (ఆదివారం), మార్చి 4 (సోమవారం), మార్చి 5 (మంగళవారం), 6 (బుధవారం), 7 (గురువారం), 10 (ఆదివారం), 11 (సోమవారం), 12 (మంగళవారం),
2024 ఏప్రిల్ లో శుభ వివాహం తేదీలు
ఈ నెలలో వేసవి గాలులను ఎంజాయ్ చేయొచ్చు. 2024 ఏప్రిల్ నెలలో మీరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే.. మరీ ఈ నెలలో శుభ వివాహ తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఏప్రిల్ 18 (గురువారం), 19 (శుక్రవారం), 20 (శనివారం), 21 (ఆదివారం), 22 (సోమవారం)
marriage
2024 మే, జూన్ మాసాల్లో శుభ వివాహం తేదీలు
మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభకరమైన వివాహ తేదీలు లేవు. అందుకే మీరు పెళ్లి చేసుకోవడానికి ముందు నెలల్లోనే ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 జూలై లో శుభ వివాహ తేదీలు
రెండు నెలల గ్యాప్ తర్వాత మీరు జూలై నెలలో పీళ్లిపీఠలు ఎక్కొచ్చు. ఈ సీజన్ లో వర్షకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలంలో ప్రశాంతంగా పెళ్లి జరగాలంటే జులైలో మీ పెళ్లి తేదీని ఫిక్స్ చేసుకోండి. మరి ఈ నెలలో ఏయే తేదీన పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే? జూలై 9 (మంగళవారం), జూలై 11 (గురువారం), 12 (శుక్రవారం), 13 (శనివారం), 14 (ఆదివారం), 15 (సోమవారం).
2024 ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు శుభదినాలు
పంచాంగం ప్రకారం.. 2024 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెళ్లి తేదీలేమీ లేవు. ఇంతకు ముందు చెప్పినట్టుగా పెళ్లిళ్లు చేసుకోవాలనుకుంటే జూలై లేదా మార్చి నెలలో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి.
marriage
2024 నవంబర్ లో శుభ వివాహం తేదీలు
2024 నవంబర్ నవంబర్ నెల చల్లగా, వేడిగా ఉండదు. ఈ నెల ఎంతో అందంగా ఉంటుంది. ఈ నెలలో మీరు ఎంచక్కా పెళ్లిపీఠలు ఎక్కొచ్చు. అందమైన శరదృతువులో పెళ్లిళ్లు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈ నెలలో ఏయే తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే? నవంబర్ 12 (మంగళవారం), నవంబర్ 13 (బుధవారం), 16 (శనివారం), 17 (ఆదివారం), 18 (సోమవారం), 22 (శుక్రవారం), 23 (శనివారం), 25 (సోమవారం), 26 (మంగళవారం), 28 (గురువారం), 29 (శుక్రవారం).
Marriage after
2024 డిసెంబర్ లో శుభ వివాహం తేదీలు
సంవత్సరపు చివరి నెల అయిన డిసెంబర్ లో పెళ్లిళ్లు చేసుకోవడానికి అద్భుతమైన సమయం. శీతాకాలాన్ని ఇష్టపడేవారికి ఇది బాగా సరిపోతుంది. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మరి ఈ నెలలో ఏయే తేదిన పెళ్లిళ్లు చేసుకోవచ్చంటే: డిసెంబర్ 4 (బుధవారం), 5 (గురువారం), 9 (సోమవారం), 10 (మంగళవారం), 14 (శనివారం).