అదంతా విన్న సింహం కుక్కకు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చి గాడిదను అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటుంది. కుక్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'అదేంటి.. రాజా! గాడిదను శిక్షించాల్సింది పోయి నన్ను శిక్షిస్తున్నావు. గడ్డి నీలం రంగులో ఉండదని మీక్కూడా తెలుసుకాదా? ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి అంటూ బాధపడుతుంది. దీనికి సింహం బదులిస్తూ.'ఆ గాడిద తెలివి తక్కువదనే విషయం నీకు వెంటనే అర్థమై ఉండాలి. అలాంటి గాడిదతో వాగ్వాదం చేయడం నీ తప్పు. దీనికోసం నా దగ్గరికి రావడం ఇంకో తప్పు. నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు. తెలివి తక్కువ గాడిదతో వాగ్వాదానికి దిగినందుకు' అని చెబుతుంది. దీంతో కుక్కకు అసలు విషయం అర్థమవుతుంది.
నీతి: మన చుట్టూ కూడా ఇలాంటి గాడిదలాంటి మనుషులు కొందరు ఉంటారు. ప్రతీ చిన్న విషయానికి వాదిస్తుంటారు. తమది తప్పని తెలిసినా మూర్ఖత్వంగా వాగ్వాదానికి దిగుతుంటారు. అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలి. లేదంటే నువ్వే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలి. అంతే తప్ప అలాంటి వారితో వాదిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం పెద్ద తప్పు.