Bad Breath: బ్రష్ చేసినా నోరు దుర్వాసన వస్తోందా? వీటితో చెక్ పెట్టేయండి..!

Published : Nov 01, 2025, 05:28 PM IST

Bad Breath: ఈ రోజుల్లో చాలా మంది అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో నోటి దుర్వాసన కూడా ఒకటి. మరి, ఈ సమస్యకు పరిష్కారాలు తెలుసుకుందాం... 

PREV
15
నోటి నుంచి దుర్వాసన

నోటి దుర్వాసన అనేది చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. ఇది మన ఆత్మశివ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతరులతో మాట్లాడటానికి మనం వెనకాడేలా చేస్తుంది. ఈ దుర్వాసనను వదిలించుకోవాడానికి మనం వంట గదిలో లభించే కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించవచ్చు.

25
లవంగాలు...

లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటిలోని బాక్టీరియా సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి. వాపు చిగుళ్లు, చిగుళ్లలో రక్త స్రావం, దంతక్షయం వంటి సమస్యలను సరి చేయడంలో సహాయపడతాయి. అందుకే, మీరు మీ నోటిలో లవంగాలను ఉంచి నెమ్మదిగా నమలడం వల్ల నోటి దర్వాసన పూర్తిగా తగ్గుతుంది.

35
నీరు...

మీరు రోజులో తగినంత నీరు తాగకపోయినా కూడా నోటి దుర్వాసన వస్తుంది. నోటిలోని బాక్టీరియాను బయటకు పంపడానికి నీరు సహాయపడుతుంది. అందువల్ల, మీ నోరు దుర్వాసన వస్తోందని మీరు భావిస్తే...పుష్కలంగా నీరు తాగడం ముఖ్యం. ఆ నీటిలో సగం నిమ్మకాయ రసం పిండుకొని తాగితే నోరు మరింత తాజాగా ఉంటుంది.

45
తేనె, దాల్చిన చెక్క...

తేనె, దాల్చిన చెక్క రెండూ బలమైన శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటిలో బాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి దంతాలు, చిగుళ్లపై పూయడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్త స్రావం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

దాల్చిన చెక్క:

తీపి రుచిగల దాల్చిన చెక్క బెరడు నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. లవంగాల మాదిరిగానే, దాల్చిన చెక్క కూడా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి మీ నోటిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కొన్ని నిమిషాలు ఉంచుకున్నా సరిపోతుంది.

55
ఉప్పు నీరు:

గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వల్ల, చెడు బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. ఉప్పు నీరు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. మీ నోటిని తాజాగా ఉంచుతుంది. ఒక గ్లాసు నీటిలో పావు నుండి అర టీస్పూన్ ఉప్పు కలిపి బయటకు వెళ్ళే ముందు దానితో పుక్కిలించడం మంచిది.

ఈ సింపుల్ పద్దతులు ఉపయోగించి కూడా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories