Salt Water Bath: బకెట్ నీటిలో ఉప్పు వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది వాస్తు శాస్త్రం. మానసిక, శారీరక ఒత్తిడిని తట్టుకునే శక్తి వస్తుందట. అంటే ఇంట్లో, శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని చెబుతోంది.
జీవితంలోని కొన్ని కష్టాలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ కారణంగా చెప్పుకోవాలి. మన చుట్టూ ఉండే కొన్ని వస్తువులు నెగెటివ్ ఎనర్జీని పెంచేస్తాయి. అయితే కొన్ని వస్తువుల ద్వారానే ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. మనం ఇంట్లోంచి మాత్రమే కాదు మన శరీరం నుంచి కూడా నెగెటివ్ ఎనర్జీని తొలగించే ఛాన్స్ ఉప్పు వల్ల దక్కుతుంది. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం, మనసు తేలికపడతాయి. జీవితంలో నెగెటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. ఉప్పు నీటి స్నానం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
24
ఎన్నో లాభాలు
ఉప్పుకు నెగెటివ్ ఎనర్జీని తొలగించే శక్తి సహజంగానే ఉంటుంది. ఉప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే, శరీరం, మనసు తేలికపడతాయి. ఉప్పు నీటి స్నానం మన చుట్టూ ఉన్న చెడు శక్తిని చాలా వరకు తగ్గిస్తుంది. ఇది మన జీవితంలో పాజిటివిటీని పెంచుతుంది. మీకు నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతున్నప్పుడు ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది.
34
ఒత్తిడి తగ్గుతుంది
మీకు విచారంగా లేదా భయంగా అనిపించినప్పుడు బకెట్ నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే మంచిది. వాస్తు శాస్త్ర నిబంధనల ప్రకారం ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. పనుల్లో ఆటంకాలు కూడ చాలా వరకు తగ్గుతాయి. కొన్నిసార్లు చాలా కష్టపడి పనిచేసినా ఫలితం సరిగా ఉండదు. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జీవితంలోని నెగెటివ్ విషయాలను తగ్గిస్తుంది. పనులు మళ్లీ సాఫీగా సాగుతాయి.
బకెట్ నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా మారుతుంది. మీరు చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం తగ్గుతుంది కాబట్టి ఇతరులతో మీ సంబంధాలు బలపడతాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా మీరు తాజాగా, శక్తివంతంగా ఉంటారు. అయితే, రోజూ ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది కాదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.