వయసు చిన్నదే అయినా ముడతల వల్ల పెద్ద వయసు వారిలా కనిపిస్తున్నారా? వీటిని తింటే ఈ సమస్యే ఉండదు

Published : May 21, 2023, 01:57 PM IST

కొన్ని జీవన శైలి అలవాట్ల వల్ల చిన్న వయసు వారు కూడా పెద్దవయసు వారిలా కనిపిస్తుంటారు. అంటే చర్మం ముడతలు పడటం, ముఖంపై గీతలు ఏర్పడటం, చర్మం సాగడం, నల్లని మచ్చలు వంటివి వస్తుంటాయి. 

PREV
16
 వయసు చిన్నదే అయినా ముడతల వల్ల పెద్ద వయసు వారిలా కనిపిస్తున్నారా?  వీటిని తింటే ఈ సమస్యే ఉండదు
anti-ageing foods

వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు వస్తాయి. మీ చర్మం యవ్వనంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటున్నారు నిపుణులు. అవును చర్మం ఆరోగ్యం కోసం యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మొదలైనవి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇవి మీ చర్మాన్ని  ఆరోగ్యంగా ఉంచడమే కాదు మీరు మరింత కాంతివంతంగా కనిపించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

26
Image: Getty Images

బెర్రీలు

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బెర్రీలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కోరిందకాయలు వంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. బెర్రీలను తీసుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

36
nuts

గింజలు

రోజూ గుప్పెడు గింజలను తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. గింజలు విటమిన్ల భాండాగారం. విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే గింజలను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
 

46

బచ్చలికూర

బచ్చలికూర ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే బచ్చలికూర వంటి ఆకుకూరలను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం చర్మ ఆరోగ్యానికి మంచిది.
 

56
Image: Freepik

అవొకాడో

అవొకాడోలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అవొకాడోల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవొకాడో చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

66
papaya seeds

బొప్పాయి

బొప్పాయి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉండే బొప్పాయిలో 91-92% వాటర్ కంటెంట్ ఉంటుంది. బొప్పాయిలో మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

click me!

Recommended Stories