ఆడవారికే కాదు మగవారికి కూడా జుట్టంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పొడవాటి, నల్లని జుట్టును ప్రతి ఒక్క మహిళా ఇష్టపడుతుంది. కానీ ఈ కాలంలో జుట్టు రాలడం, డ్రై హెయిర్, చుండ్రు, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి.
నిజానికి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మీ జుట్టుకు అవసరమైన పోషకాలు మీ శరీరంలో లేకపోవడం, జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల తెల్ల జుట్టు వస్తుంది. ఈ తెల్ల వెంట్రుకలు రాకూడదని చాలా మంది నూనెలను, షాంపూలను మారుస్తుంటారు. కానీ ఇలాంటప్పుడు మీరు చేయాల్సింది ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాగే తెల్ల వెంట్రుకలు రావడానికి గల కారణాల్ని తెలుసుకోవాలి.
grey hair
ప్రస్తుత కాలంలో 30 ఏండ్లు దాటిన వెంటనే జుట్టు తెల్లబడుతుంది. ఇది మీ రూపాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. మీ వయసు చాలా పెద్దదిగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు ఇది కొన్ని అనారోగ్య సమస్యలను కూడా సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే నిపుణుల ప్రకారం.. తెల్ల వెంట్రుకలను తగ్గించడానికి కొన్ని పదార్థాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Grey hair
తెల్ల వెంట్రుకలను నల్లగా చేసే పదార్థాలు
ఉసిరికాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మన జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉసిరికాయలో విటమిన్ -సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఇనుము శోషణను బాగా పెంచుతుంది. దీంతో మీ వెంట్రుకలు తెల్లబడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఉసిరికాయలో జింక్ తో పాటుగా ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.
కరివేపాకును మనం ప్రతి కూరలో వేస్తుంటాం. చాలా మంది దీన్ని మంచి మంచి వాసన కోసం, టేస్ట్ కోసం వంటల్లో వేస్తుంటారు. కానీ దీనిలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగంగా ఉంచడమే కాకుండా.. మన జుట్టును హెల్తీగా కూడా ఉంచుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్-బిలో మెలమైన్ ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ తెల్లగా మారకుండా చేస్తుంది.
అంతేకాదు కరివేపాకులో కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది మన జుట్టు మూలాలను బలంగా చేసి వెంట్రుకలు రాలకుండా చేస్తుంది. కరివేపాకులో ఉండే ఐరన్ కంటెంట్ కూడా జుట్టును బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును నల్లగా ఉంచుతుంది.
grey hair
అంజీర్ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈ పండ్లు మనల్ని హెల్తీగా ఉంచడమే కాకుండా.. మన జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.
అత్తి పండ్లను తింటే తెల్ల జుట్టు తగ్గిపోయి వెంట్రుకలు నల్లగా అవుతాయి. వీటితో పాటుగా తులసి గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తాయి.
తెల్ల జుట్టు తగ్గాలంటే ఈ డ్రింక్ ను తాగండి
కావాల్సిన పదార్థాలు
ఉసిరికాయ జ్యూస్ - 1 టీ స్పూన్
కరివేపాకు - గుప్పెడు ఆకులు
అంజీర్ పండ్లు- 2 నానబెట్టినవి
నీళ్లు - 50 మి.లీ
తులసి గింజలు - 1 టీస్పూన్
ఎలా తయారుచేయాలి?
ఉసిరికాయ జ్యూస్ ను, కరివేపాకులను, నానబెట్టిన అంజీర్ పండ్లను నీళ్లలో వేసి గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్ పై తులసి గింజలను వేసి బాగా కలపాలి. అంతే తెల్ల వెంట్రుకలను నల్లగా చేసే డ్రింక్ రెడీ అయినట్టే. దీన్ని తాగితే తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.