Jeedipappu Health Benefits: జీడిపప్పులను పచ్చిగా తింటే ఏమౌతుందో తెలుసా..?

Published : Mar 29, 2022, 12:30 PM IST

Jeedipappu Health Benefits: జీడిపప్పులను పచ్చిగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని రెగ్యులర్ గా తింటే వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. ముఖ్యంగా జీడిపప్పు డయాబెటిక్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. 

PREV
110
Jeedipappu Health Benefits: జీడిపప్పులను పచ్చిగా తింటే ఏమౌతుందో తెలుసా..?
Cashew fruit

Jeedipappu Health Benefits: ఈ వేసవిలోనే జీడిపండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు ఈ పండ్లు ఇతరదేశాల్లోనే పండేవి. ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా ఈ పండ్ల సాగు బాగా పెరిగింది. జీడిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఇక జీడిపప్పు ప్రయోజనాలైతే అమోఘం అనే చెప్పాలి. 

210
Cashew Nut

జీడిపప్పుల్లో మాంసకృత్తులు , విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, కొవ్వు పదార్థాలు, ఖనిజాలు, లవణాలు, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం , ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.

310

జీడిపప్పులను తరచుగా తింటే రక్తప్రసరణ  (Blood circulation) మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు వీటిలో రక్తపోటును నియంత్రించే గుణముంటుంది కూడా. 

410

జీడిపప్పుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు ఎంతో సహాయపడతాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటూ  ఉండండి. 

510

జీడిపప్పులను తింటూ కూడా సులభంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఎలా అంటే వీటిని కొన్నింటిని తినగానే కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో మీరు ఫుడ్ ను ఎక్కువగా తీసుకోలేరు. కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు మీ రోజు వారి డైట్ లో కొన్ని జీడిపప్పులను చేర్చుకోండి. 

610

జీడిపప్పుల్లో ఉండే  Unsaturated fats వల్ల Cardiovascular ముప్పు కూడా తప్పుతుంది. పచ్చి జీడిపప్పులో.. ఉడికించిన మాంసంలో ఎలా అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయో.. అలాగే వీటిలో కూడా ప్రోటీన్ అంత ఎక్కువగా ఉంటుంది. 

710

జీడిపప్పులో మాంగనీస్, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటివల్ల కంరాలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి.

810

జీడిపప్పులను పచ్చివిగానే తిన్నా లేదా వేయించుకుని తిన్నా.. ఇవి చాలా ఫాస్ట్ గా అరుగుతాయి. టైప్ 1 , టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు ఇవి ఎంతో మేలుచేస్తాయి. 

910

సంతాన లేమి సమస్యల పరిష్కారానికి కూడా జీడిపప్పు ఎంతో సహాయపడుతుంది. పలు పరిశోధనల ప్రకారం.. కొన్ని జీడిపప్పులు, వాల్ నట్స్, పిస్తా వంటి డ్రై ఫూట్స్ ను నిత్యం గుప్పెడు తింటే శుక్రకణాల సంఖ్య పెరుగుతుందట. అంతేకాదు అవి ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా కూడా ఉంటాయట. 
 

1010

అయితే కిడ్నీ ఆకారంలో కనిపించే జీడిపప్పులను పచ్చిగానే తింటే చర్మంపై ఎఫెక్ట్ పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జీడిపప్పులను కాస్త వేయించుకుని తింటే చక్కటి ఫలితాలను పొందవచ్చు. 

click me!

Recommended Stories