వెండి ఉంగరాలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 21, 2024, 4:09 PM IST

కొంతమంది బంగారు ఉంగాలను పెట్టుకుంటే.. మరికొంతమంది మాత్రం వెండి ఉంగరాలను పెట్టుకుంటుంటారు. బంగారు ఉంగారాలంత ఖరీదు కాకపోయినా.. వెండి ఉంగరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తెలుసా? 

వెండితో పోలిస్తే బంగారమే ఎక్కువ ఖరీదైనది. కానీ బంగారంతో పాటుగా వెండి ఆభరణాలను ప్రతి ఒక్కరూ ధరిస్తారు. కాళ్ల పట్టీలు, మెట్టెల, నడుము వడ్డానంతో పాటుగా ఉంగరాలను ప్రతి ఒక్కరూ పెట్టుకుంటుంటారు.

వెండి రేటు తక్కువ కావొచ్చు కానీ.. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మెట్టెల నుంచి ఉంగరాల వరకు వెండి ఆభరణాలను పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా బంగారు ఉంగరాల కంటే వెండి ఉంగరాలను పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


శరీర వేడిని తగ్గిస్తుంది

వెండి ఉంగరాలను పెట్టుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? వెండి ఉంగరాలు లేదా పట్టీలు లేదా చైన్ ను ధరిస్తే.. కొన్ని రోజులకు అది కొంచెం నల్లబడుతుంది. నిపుణుల ప్రకారం.. మన శరీర వేడిని తగ్గించడం వల్లే ఇలా వెండి నల్లగా మారుతుంది. మనం పెట్టుకున్న వెండి ఉంగరాలు ఎంత నల్లబడితే అంత వేండిని మన శరీరంలో తగ్గిస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. అయితే మీరు వెండి ఉంగరాన్ని క్రమం తప్పకుండా ధరించడం వల్ల మీ శరీర రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. హెల్తీగా ఉంటారు. 
 


ఒత్తిడిని తగ్గిస్తుంది

ఒత్తిడి ఒక మానసిక సమస్యే. అయినా దీన్ని లైట్ తీసుకుంటే మీరు ఎన్నో ప్రమాదకరమైన శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వాస్తు ప్రకారం.. చిటికెన వేలికి వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అలాగే పనితీరు కూడా మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

గర్భాశయ సమస్యలకు నివారణ

వెండి ఉంగరాలు గర్భాశయ సమస్యలను తగ్గించడానికి, ఆ సమస్యలు రాకుండా చేయడానికి బాగా సహాయపడతాయి. పెళ్లైన ఆడవారు తమ బొటనవేళికి వెండి ఉంగరాలు పెట్టుకుంటే వేళ్లలోని నరాల ద్వారా గర్భాశయ సమస్యలు పరిష్కారమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే పురుషులు చూపుడు వేలికి వెండి ఉంగరం పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటీవ్ ఎనర్జీ కోసం ఆడవాల్లు ఉంగరం వేళికి దీన్ని పెట్టుకోవాలి. 

Latest Videos

click me!