చెరుకు రసం మన ఆరోగ్యానికి కాదు చర్మానికి జుట్టుకి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పోషకాలతో నిండిన చెరుకు రసం మిమ్మల్ని మరింత అందంగా మారుస్తుంది. చెరుకు రసం చర్మానికి, జుట్టుకి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చెరుకు రసం చర్మానికి అద్భుతమైన నాచురల్ మాయిశ్చరైజర్.
దీనిలోని అధిక గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్, చర్మం తేమను నిలుపుకోవడానికి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి పొడిబారకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. చెరుకు రసాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వలన పొరలుగా ఉండే చర్మం ప్యాచెస్ చర్మసమస్యలు తొలగిపోతాయి.
చెరుకులో ఆల్ఫా హైడ్రాక్సి ఆమ్లాలు ఉంటాయి, ఇది బ్యాక్టీరియా పేరుకు పోవడానికి తగ్గిస్తుంది. దీని సహజ ఆమ్లాలు రంద్రాలను మూసివేయడానికి అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించడానికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రాకుండా నిరోధించడానికి సహాయపడతాయి. చెరుకు రసాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది.
చెరుకు రసంలో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు, ఐరన్, జింక్, పొటాషియం వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని నివారిస్తాయి. అలాగే చర్మం రంగు కూడా మెరిసే లాగా కనిపిస్తుంది. చెరుకు రసంలో ఉండే సహజ ఆల్ఫా హైడ్రాక్సి ఆమ్లాలు చర్మాన్ని సున్నితంగా ఎక్స్పోజింగ్ చేస్తాయి అలాగే మృతకణాలు, మలినాలను తొలగిస్తాయి.
దీంతో చర్మం తెల్లగా మారుతుంది చెరుకు రసం క్రమం తప్పకుండా ఎక్స్పోలియేషన్ చేయటం వలన చర్మం ఆకృతి మెరుగుపడుతుంది. అలాగే చెరుకు రసానికి రికవరీ ప్రక్రియను ఫాస్ట్ చేయడంలో సహాయపడుతుంది. గాయాలను నయం చేయటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది, ఇందులో ఉండే విటమిన్ సి కణజాల మరమ్మతులను ప్రోత్సహించడానికి సహాయపడతాయి.
అలాగే చెరుకు రసం జుట్టుని హైడ్రేట్ చేయటానికి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది చుండ్రుని తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది చెరకులో ఉండే అమ్మాయిను ఆమ్లాలు మరియు పోషకాలు జుట్టు కుదురులకు అవసరమైన పోషణను అందిస్తుంది దీనితో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.