Alia Bhatt: అలియా భట్ బ్యూటీ సీక్రెట్.. ప్రతిరోజూ ఇది తినాల్సిందే

Published : May 14, 2026, 01:47 PM IST

Alia Bhatt: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి ఆలియా భట్ తన చర్మ సౌందర్య రహస్యాన్ని బయటపెట్టారు. ఖరీదైన క్రీములు కాకుండా.. మన వంటగదిలో దొరికే నెయ్యి, బెల్లం, వేరుశనగ, కొబ్బరితో చేసిన 'స్కిన్ స్నాక్' వల్లే తన స్కిన్ అంత క్యూట్‍గా ఉంటుందంట.

PREV
16
మేకప్ వల్ల మాత్రమే అందం రాదు

సినిమా స్టార్స్ అందం అంటే కేవలం కిలోల కొద్దీ మేకప్ మాత్రమే కాదు... అసలైన గ్లో మనం తినే ఆహారంలోనే ఉంటుందని బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నిరూపించారు. అందం అనేది లోపలి నుంచి రావాలని చెప్పుకొచ్చారు. 

26
వంటగదే అసలైన బ్యూటీ పార్లర్

మన వంటగదే ఒక అద్భుతమైన బ్యూటీ పార్లర్ అన్న నిజం మనకంటే విదేశీయులకే బాగా అర్థమైంది. వాళ్లు మన ఆయుర్వేదాన్ని, యోగాను నెత్తిన పెట్టుకున్నాక గానీ... మనవాళ్లకు ఇంట్లో ఉన్న వస్తువుల విలువ తెలియడం లేదు. ఇప్పుడు వాటినే అనుసరిస్తున్నారు. చాలా మంది పార్లర్లు, బ్యూటీ స్పాలు చేసుకుంటారు గానీ…హీరోయిన్లు, హీరోలు..హెల్దీ ఫుడ్ తింటూ తమ అందాన్ని కాపాడుకుంటూ మరింత పెంచుకుంటారు.

36
షాక్ అయిన ఫ్యాషన్ ప్రపంచం

ఫ్రాన్స్ వేదికగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్లోబల్ వేదికపై తన బ్యూటీ సీక్రెట్ గురించి బయటపెట్టేశారు. వేలకు వేలు ఖర్చు పెట్టకుండా మన భారతీయ వంటగదిలో దొరికే నెయ్యి-బెల్లం అని చెప్పడంతో ఫ్యాషన్ ప్రపంచం షాక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

46
ఆలియా వల్ల గ్లోబల్ క్రేజ్

మన ఇంటి వంటకాలకు ఆలియా వల్ల గ్లోబల్ క్రేజ్ వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ 'మేరీ క్లేర్ ఫ్రాన్స్' తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆలియా భట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె మన దేశీ సూపర్ ఫుడ్స్ అయిన నెయ్యి, బెల్లంతో చేసుకునే ఒక స్పెషల్ హెల్తీ రెసిపీని, తన బ్యూటీ సీక్రెట్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు.

56
నెయ్యే ఆమె బ్యూటీ సీక్రెట్ అంట.

తమ ఇంట్లో నెయ్యితోనే వంట చేస్తారని ఆలియా తెలిపారు. ఇది ఆరోగ్యానికి, చర్మానికి కూడా చాలా మంచిదని చెప్పారు. కొద్దిగా బెల్లం, దంచిన వేరుశనగ, కొబ్బరి తురుమును నెయ్యిలో కలిపి తాను ఒక స్నాక్ తయారు చేసుకుంటానని చెప్పారు. దీనిని "స్కిన్ స్నాక్" అని పిలుస్తామని ఆలియా అన్నారు. తన చర్మం ఇంత అందంగా కనిపించడానికి రోజూ ఇదే తింటానని ఆమె అన్నారు. ఇది నిజంగా వర్కవుట్ అవుతుందని ఆలియా అన్నారు.

66
ఆలియా తినే స్కిన్ స్నాక్ ఇదే..

స్కిన్ స్నాక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు

చెంచా నెయ్యి, చెంచా బెల్లం,  చెంచా వేయించిన వేరుశనగ, చెంచా కొబ్బరి తురుము. 

తయారుచేసే విధానం: వీటన్నింటినీ ఒక చిన్న గిన్నెలో కలిపి, చిన్న ఉండలుగా చేసి అప్పటికప్పుడు తినేయడమే. 

Read more Photos on
click me!

Recommended Stories