అందంగా మెరిసిపోయేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతారు అమ్మాయిలు. కానీ నటి అదితిరావు హైదరి రూటే వేరు. ఆమె ముఖం ఎప్పుడూ సహజమైన మెరుపుతో కనిపిస్తుంది.ఆమె అందం వెనుక ఉన్న రహస్యం మాత్రం చాలా సింపుల్. ఇంట్లో దొరికే సహజ పదార్థాలు, మంచి అలవాట్లే ఆమె చర్మం మెరుపుకు కారణం. అదితి స్కిన్‌కేర్‌లో ఇంట్లో దొరికే సహజ పదార్థాలను అధికంగా వినియోగిస్తుంది. ఆమె తరచూ తేనె, పసుపు, పెరుగు, శెనగపిండి, అలొవెరా వంటి పదార్థాలతో ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకుని వాడుతుంది. ఈ పదార్థాలు చర్మానికి తేమను అందించి, మృదువుగా మారుస్తాయి. అలాగే చర్మంపై ఉన్న మచ్చలు, మురికి పోయేందుకు సహాయపడతాయి. రసాయనాలున్న క్రీములు కాకుండా ఇంటి చిట్కాలను ఆమె ఎక్కువగా ఫాలో అవ్వడం వల్లే ఆమె చర్మం తాజాగా కనిపిస్తుంది.